Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు.. ఎందుకంటే?

Advertiesment
ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు.. ఎందుకంటే?
, శనివారం, 9 అక్టోబరు 2021 (21:06 IST)
ఏనుగు బురదలో కూరుకుని మృతి చెందింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు అతికష్టం మీద దాన్ని బయటకు తీశారు. తమిళనాడులోని నీలగిరిలోని మాళవన్ చేరంపాడిలో.. సుమారు పదిహేను వందల కిలోల అధిక బరువు ఉండడంతో అక్కడే ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఫారెస్ట్ అధికారులకు స్థానిక గ్రామస్థుల నుండి నిరసనలు ఎదురయ్యాయి. 
 
ఏనుగు ఖననం చేసే ప్రాంతంలో ఊరు ప్రజలు వాడుకునే మంచినీటి బావి ఉండడడంతో వారు వ్యతిరేకించారు.. ఏనుగును అక్కడే పూడ్చి పెట్టడడం వల్ల భవిష్యత్‌లో బావి నీళ్లు కలుషితం అవుతాయని చెప్పారు. 
 
దీంతో ఏనుగును అక్కడి నుండి తరలించి అటవీ ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కిలోల బరువున్న ఏనుగును తరలించడం సాధ్యం కాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు.. దీంతో ఏనుగును కట్ చేసి విడివిడిగా మోసుకు పోవాలని నిర్ణయించారు. దీంతో చినిపోయిన ఏనుగును ముక్కలుగా కోశారు. ఇలా పదిహేను ముక్కలుగా ఏనుగును కత్తిరించి మూటల్లో తరలించారు.
 
అయితే ఇలా ఏనుగును ముక్కలుగా కట్ చేసి తరలించడం మొదటి సారి అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారడంతో పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా వైరస్: 629 కొత్త కేసులు.. ఎనిమిది మంది మృతి