Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలు అనుకుని ఫినాయిలు తాగినా బాలుడు

పాలు అనుకుని ఫినాయిలు తాగినా బాలుడు
, శనివారం, 25 జనవరి 2020 (14:57 IST)
పాలు అనుకొని ఫినాయిల్ తాగి బాలుడు మృత్యువాతపడిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలం తురకగూడేనికి చెందిన వడ్డెంపుల నగేశ్‌, నాగమణి దంపతుల తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటేశ్‌ స్థానిక మండల పరిషత్తు పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. 
 
రోజు పాఠశాలకు వెళ్లే ముందు బాలుడికి పాలు తాగడం అలవాటు. జనవరి 11న రోజూలాగే స్కూల్‌కు బయలుదేరిన వెంకటేశ్.. వెళ్లే ముందు పాలు అనుకొని సీసాలో ఉన్న ఫినాయిల్‌ తాగాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. పాఠశాలకు వెళ్లిన కాసేపటికే వాంతులవడంతో బాలుడు ఇంటికి తిరిగొచ్చాడు. తల్లి నాగమణి బాలుడిని తీసుకొని స్థానికంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించింది.
 
పరిస్థితి విషమించడంతో బాలుడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నిలోఫర్‌కి తరలించారు. చికిత్స పొందుతూ  శనివారం వేకువజామున వెంకటేశ్ ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లి కన్నీరుమున్నీరైంది. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం బాలున్ని స్వగ్రామానికి తరలించారు. 
 
దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. బాలుడిని చూసేందుకు గ్రామం మొత్తం తరలి వచ్చారు. తల్లిదండ్రులు రోదలు చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. రసాయనాలను, ఇతర హానికర పదార్థాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే విషాదమే మిగులుతుందని పోలీసులు సలహా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళపై హత్యాచారం.. అత్యాచారానికి పాల్పడి.. నోట్లో బియ్యం పోశారు..