Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ : కాంగ్రెస్ - తెరాస హోరాహోరీ :: సత్తా చాటిన జూపల్లి

Advertiesment
Telangana municipal election 2020 results live
, శనివారం, 25 జనవరి 2020 (11:59 IST)
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ముఖ్యంగా, ధర్మపురి మునిసిపాలిటీలో రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా పోరు సాగింది. విజయం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా సాగింది. 
 
మొత్తం 15 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 7వార్డుల్లో గెలుపొందాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్నులొట్టపోయినట్టుగా ఒక్కవార్డు తేడాతో అతి కష్టం మీద టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇద్దరిని లాగేసుకునేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులు మాత్రం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది.
 
మరోవైపు, పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా చాటుకున్నారు. టీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రస్తుతం కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి వర్గమే టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులుగా పోటీచేశారు. 
 
అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, తెరాస మధ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 12 వార్డుల్లో ఆరు టీఆర్ఎస్ గెలవగా, ఐదు కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. ఏడో వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో వార్డులో రిపోలింగ్‌ జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఫలితాన్ని బట్టి.. మున్సిపల్ పీఠం ఎవరిదన్న విషయం తెలియనుంది. ఒక వేళ ఇరుపార్టీలకు సమానమైన వార్డులు వస్తే లాటరీ వేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో కరోనా వైరస్ విజృంభణ : అష్టదిగ్భంధనంలో నగరాలు