Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు పెంచలకోన పుణ్యక్షేత్రానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు...

chandrababu naidu

ఠాగూర్

, శుక్రవారం, 22 మార్చి 2024 (07:44 IST)
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రానున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్లను దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు హెలికాఫ్టరులో చేరుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత ఆయన విజయవాడలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 
 
మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సివుంది. ఇంకోవైపు, లోక్‌సభ ఎన్నికల కోసం 17 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సివుంది. ఇందుకోసం ఆయన ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144 స్థానాల్లోనూ, 25 లోక్‌సభ సీట్లలో 17 చోట్ల పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అలాగే, పొత్తులో భాగంగా, జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 5 లోక్‍‌సభ, అసెంబ్లీ సీట్లలో జనసేనకు 21 అసెంబ్లీ, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లను కేటాయించిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, విశాఖ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూటమి అభ్యర్థులు గట్టి పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో టీడీపీ తరవున గీతం భరత్ పోటీ చేయాలని భావిస్తుండగా, బీజేపీ తరపున జీవీఎల్ నరసింహా రావు పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఇలాంటి అంశాలను పరిష్కరించిన తర్వాతే మిగిలిన అభ్యర్థుల జాబితాను ఇరు పార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్ చెన్నై నుంచి బరిలోకి దిగుతున్న తెలంగాణ మాజీ గవర్నర్!