Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్మాదంతో దాడులు చేస్తున్న వైకాపా నేతలు : చంద్రబాబు

Advertiesment
ఉన్మాదంతో దాడులు చేస్తున్న వైకాపా నేతలు : చంద్రబాబు
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:06 IST)
వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైకాపా నేతలు ఉన్మాదంతో రెచ్చిపోతు దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 
 
ఆయన మంగళవారం మాట్లాడుతూ, ఇది నేరస్థుల ప్రభుత్వమన్నారు. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారకపోతే దాడులు చేస్తామంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
 
వైసీపీ దాడులతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 'నేను మీలాగే వ్యవహరిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవారు?. దొంగసారా, బెట్టింగ్‌ కాసే వాళ్ళు ఎమ్మెల్యేలా?' అంటూ నిలదీశారు. 
 
కేసుల పేరుతో మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేకు పిచ్చి పట్టింది.. మహిళల జోలికొస్తే తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. జగన్ జేఎస్టీని తలపిస్తూ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్‌కు తెరతీస్తున్నారని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ గవర్నర్‌కు కేంద్రం పిలుపు... ఆగమేఘాలపై హస్తినకు చేరిక..