Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పింక్ డైమండ్ సంగతి ఏంటి...? ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలా...??

పింక్ డైమండ్ సంగతి ఏంటి...? ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలా...??
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:26 IST)
క్రైస్తవుడినని చెప్పుకునే సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పించారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతుడా అని నిలదీశారు. అధికారుల ప్రవర్తనపై చంద్రబాబు మండిపడ్డారు. క్రైస్తవుడినని చెప్పుకునే జగన్​ ఎందుకు డ్లికరేషన్ తీసుకోలేదని నిలదీశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇతర మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌ ఇస్తారన్న ఆయన... అబ్దుల్‌ కలాం కూడా డిక్లరేషన్‌ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. తిరుమల వేంకటేశ్వరుని కన్నా జగన్ అతీతులుకాదని నిలదీశారు. గతంలో స్వామి వారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని అసత్య ప్రచారం చేసిన తితిదే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి... ఇప్పుడు మాటమార్చి పింక్ డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 
 
పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అతిగా ప్రవర్తించవద్దు పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని చంద్రబాబు సూచించారు. వైకాపా ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గమనించాలన్నారు.

గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అధికారులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్న చంద్రబాబు... శాంతిభద్రతల కోసం గతంలో తెదేపా నేతలనే జైలుకు పంపామన్నారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకెళ్లాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మహిళకు ఎంత గుండె ధైర్యం : సింహం ముందు నృత్యం!!