Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూన్ 1నుండి ఎల్ ఎల్ ఆర్, ఎఫ్ డి ఎల్స్ ప్రారంభం

జూన్ 1నుండి ఎల్ ఎల్ ఆర్, ఎఫ్ డి ఎల్స్ ప్రారంభం
, బుధవారం, 27 మే 2020 (22:47 IST)
కోవిడ్ 19 తో లాక్ డౌన్ కారణంగా నిలుపుదల చేసిన లెర్నింగ్ లైసెన్సు కొత్త డ్రైవింగ్ లైసెన్సుల సర్వీసులను పునప్రారంభిస్తున్నట్లు డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.

కరోనా వ్యాధి నైపథ్యంలో బయోమెట్రిక్ ద్వారా నిర్వహించే లెర్నల్ లైసెన్సులు కొత్త డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా నిలుపుదల చెయ్యడమైనదని ఈ నెల31తో లాక్ డౌన్ ముగియడంతో జాన్1వ తారీఖు నుండి యధావిధిగా ఎల్ ఎల్ ఆర్ పరీక్షలు, కొత్త డ్రైవింగ్ లైసెన్సుల సేవలను కొనసాగించాలని నిర్ణహించినట్లు డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.

జూన్1వ తారీఖు నుండి యధావిధిగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటినుండే ఆన్ లైన్ లో డ్రైవింగ్ లైసెన్సుల స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. లాక్ డౌన్ తో డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించలేని కారణంగా ముందుగా స్లాట్ బుక్ చేసుకొన్నవారు ఆన్ లైన్ లో స్లాట్ బుకింగ్ తేదీలను మార్చుకోని డ్రైవింగ్ పరీక్షలకు హాజరావచ్చని డిటీసీ తెలిపారు.

కోవిడ్19 ను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నాం అన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల నిమిత్తం ఒకరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇస్తాన్నామని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వలన కరోనా వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రతిఒక్కరు సహకరించాలన్నారు.

మనిషికి మనిషికి మధ్య భౌధిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు తప్పక ఫేస్ మాస్క్ ధరించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మౌలిక సదుపాయాలు కల్పించాలి: జగన్ కు నిర్మాతల మండలి లేఖ