Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యుత్ చార్జీలను రద్దు చేయాలి: కేశినేని నాని

Advertiesment
Electricity charges
, బుధవారం, 27 మే 2020 (21:20 IST)
మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మే 27, బుధవారం నాడు ప్రారంభమైన వర్చ్యువల్ మహానాడులో ‘విద్యుత్ చార్జీల పెంపు – మాట తప్పిన జగన్’ అన్న తీర్మానాన్ని కేశినేని నాని ప్రతిపాధించగా బీటీ నాయుడు బలపరిచారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చి జగన్ పరిపాలన మొదలుపెట్టారని, అన్నారు. జగన్ పాలన రాజకీయ స్వార్ధంతో తప్పా ప్రజా సంక్షేమం ధ్వేయంగా చేయడం లేదని దుయ్యబట్టారు. కోర్టులు తప్పుబడుతున్నా సరిచేసుకోవడం లేదు.

జగన్ ప్రతీ నిర్ణయంలో అనుభవ రాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కరోనాను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కష్టకాలంలో ప్రజల ఆర్ధిక పరిస్థితి పట్ల బాధ్యతగా వ్యవహరించలేదని అన్నారు.
 
రాష్ట్రం విడిపోయిన సంధర్భంలో రూ. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జట్ లో మొదలైన రాష్ట్రంను అభివృద్ధిలో నడిపించి ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తారా అన్న సంధర్బంలో ఏనాడు ఉద్యోగస్తుల జీతాలలో కోత పెట్టకుండా 40 శాతం ఫిట్మెంట్ ను చంద్రబాబు ఇచ్చారని చెప్పారు.

అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవని కానీ జగన్ ఉద్యోగస్తులకు 50 శాతం జీతాలు కట్ చేయడం అన్యాయమన్నారు.  తన ఏడాది పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని, విద్యుత్ చార్జీలు పెంచమని ప్రమాణస్వీకార సభలో చెప్పిన జగన్ ఏడాదిలో రెండుసార్లు విద్యుత్ చార్జీలను మూడు రెట్లు పెంచి ప్రజల నడ్డి విచారన్నారు.

జగన్ పాత విధానాన్ని మార్చి మూడు స్లాబులు 7 కేటగిరీలు చేసి విద్యుత్ చార్జీలు పెంచాడన్నారు. వ్యవసాయదారులను, ఆక్వా రైతులను కూడా జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. 
 
తెదేపా ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు గురించి మాట్లాడుతూ ‘చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదని తిరిగి అధికారానికి వస్తే చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేనాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును 100 రోజుల్లో అధిగమించడం జరిగిందని, సోలార్ విద్యుత్ రంగంలో రూ. 36,604 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 13 వేల మందికి రాయలసీమలో ఉద్యోగాలు కల్పంచారన్నారు.

పాత శ్లాబు విధానాన్నే కొనసాగించి కరోన కష్ట కాలంలో విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తీర్మానాన్ని బలపరుస్తూ బీటీ నాయుడు మాట్లాడుతూ.. జగన్ పెంచిన విద్యుత్ చార్జీలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కోలుకోలేని దెబ్బతిన్నారని అన్నారు.

ప్రజలు ఆర్ఢిక ఇబ్బందులు ఎదర్కొంటుంటే ముఖ్యమంత్రి 66 మంది సలహాదారులు ఒక్కొక్కరు రూ 3.50 లక్షలు లెక్కన జీతాలు తీకున్నారని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిమోట్‌ యాప్‌లతో ఖాతాలు ఖాళీ!.. రూటు మార్చిన జార్ఖండ్‌ సైబర్‌ మోసగాళ్లు