Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘పెళ్లిసందD’ శ్రీలీల నా కూతురు కాదు : సూరపనేని శుభాకరరావు

‘పెళ్లిసందD’ శ్రీలీల నా కూతురు కాదు : సూరపనేని శుభాకరరావు
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:41 IST)
webdunia
‘పెళ్లిసందD’ సినిమా హీరోయిన్‌ శ్రీలీల తన కుమార్తె కాదని విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు చెప్పారు. శ్రీలీల తన బయోడేటాలో తన తండ్రి పేరును శుభాకరరావు సూరపనేనిగా పేర్కొంది. అయితే శ్రీలీల తన కుమార్తె కాదని శుభాకరరావు స్పష్టం చేశారు.

శుభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలీల తన కుమార్తె కాదని క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల తల్లి స్వర్ణలతతో తాను 20 ఏళ్ల క్రితమే విడిపోయానని చెప్పారు. తాము విడిపోయే సమయానికి తన మాజీ భార్య గర్భవతి కూడా కూదని, తాము విడిపోయాక వేరొకరి ద్వారా తన మాజీ భార్యకు శ్రీలీల జన్మించిందని వివరించారు.

తన ఆస్తులపై క్లయిమ్ చేయడానికే తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని చెప్పారు. తనకు సాయితన్వి సూరపనేని అనే ఒక్క కుమార్తె మాత్రమే ఉందని శుభాకరరావు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి