Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాన్లు కొందామని షాపుకెళితే, బంధించి రాత్రంతా రేప్ చేశాడు.. చివరకు?

Advertiesment
shop owner
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:35 IST)
ఇంట్లో భర్త లేడు. వంట చేసుకోవడానికి సామాన్లు కావాలి. ఇంట్లో ఉన్న యువతిని పంపిచడానికి సాహసించలేదు. బాగా చీకటి పడింది. ఇక ఆమె గ్రామంలో చివరన ఉన్న దుకాణానికి వెళ్ళింది. వెళ్ళిన వివాహిత మళ్లీ తిరిగి రాలేదు. ఇంటికి వచ్చిన భర్త, తన భార్య దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదని తెలుసుకుని భయపడి చివరకు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అత్యాచారానికి గురైందని తెలుసుకుని కుమిలిపోయాడు.
 
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడులో నివాసముంటున్నారు కనకరాజు అతని భార్య రాధ, కనకరాజు చెల్లెలు. కనకరాజు చెల్లెలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. కనకరాజు ట్రాక్టర్ రిపేర్ రావడంతో గుంటూరు నగరానికి తీసుకెళ్ళాడు.
 
ట్రాక్టర్ రిపేర్ చేయడానికి ఒకరోజు ఉండాలని మెకానిక్ చెప్పడంతో స్నేహితుని ఇంట్లో ఉండి మరుసటి రోజు వస్తానని భార్య రాధకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంట్లో సామాన్లు లేవు. వంట చేసుకోవడానికి భర్త వస్తువులను తీసుకొచ్చి ఇవ్వలేదు. 
 
రాత్రి 9 గంటలవుతోంది. ఇంట్లో ఉన్న యువతిని పంపించకుండా ఆమే నేరుగా గ్రామంలో చివరన ఉన్న దుకాణానికి వెళ్ళింది. అయితే దుకాణ యజమాని శాంతిరాజు ఎప్పటి నుంచో రాధపై కన్నేసి ఉన్నాడు. శాంతి రాజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుకాణానికి వచ్చిన రాధను బలవంతంగా నోరు మూసి ఇంట్లోకి లాక్కెళ్లాడు.
 
నోట్లో గుడ్డలు కుక్కి తాళ్ళతో ఆమెను బంధించాడు. ఆ తరువాత ఆమెపై పలుమార్లు రాత్రంతా అత్యాచారం చేశాడు. మరోవైపు వదిన రాకపోవడంతో యువతి ఆందోళనతో అన్నకు ఫోన్ చేసింది. గ్రామంలో రాధ బంధువులు ఉండటంతో వారి ఇంటికి వెళ్ళి ఉండొచ్చని.. నువ్వు నిద్రపో రేపు వచ్చి మాట్లాడదామన్నాడు అన్న.
 
అయితే ఎంతకూ ఆమె రాకపోవడంతో గ్రామస్తులను విచారించి చివరకు పోలీస్టేషన్‌కు వెళ్ళాడు. కనకరాజు ఇంటికి వచ్చేలోపు రాధ వాళ్ళ ఇంట్లో ఉంది. తనను శాంతిరాజు అత్యాచారం చేశాడని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులే శాంతిరాజుకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం.. తర్వాత నిరవధిక వాయిదా