Publish Date: Thu, 05 Sep 2019 (15:45 IST)
Updated Date: Thu, 05 Sep 2019 (15:47 IST)
ఇసుక దోపిడీ అరికట్టేందుకు చిత్తశుద్ధితో పని చేయాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.
గురువారం కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద ప్రభుత్వం అధ్వర్వంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, నందిగామ శాసనసభ్యులు మెండితోక జగన్మోహనరావులు ప్రారభించారు.
ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు మాదిరిగా ఉచితం అనే పేరుతో దోపిడి చేయటం లేదన్నారు. పారదర్శకమైన పాలన కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.