Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన వైకాపా రెబెల్ ఎంపీ ఆర్ఆర్ఆర్.. ఏంటిది?

raghuramaraju
, మంగళవారం, 28 మార్చి 2023 (11:03 IST)
వైకాపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ సలహా ఇచ్చారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి పోషించిన పాత్రను ఇపుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి పోషిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తమ నేత జగన్ మేల్కోకుంటే పార్టీలో సంక్షోభం తప్పదని వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, దివంగత ఎన్టీ.రామారావు ఎంత మంచివారైనప్పటికీ అప్పట్లో టీడీపీలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇపుడు వైకాపాలో సజ్జల కూడా అలానే వ్యవహరిస్తున్నారని, పరిస్థితి చేయిదాటక ముందే ఆయనను పక్కనబెట్టాలని, లేదంటే పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని సీఎం జగన్‌కు సూచించారు. 
 
ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి పత్రిక విలేఖరి అయిన సజ్జలకు రిపోర్టు చేయాలని అనడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతారన్న మాజీ మంత్రి, వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్న న్యాయబద్ధంగా, సబబుగా ఉందని చెప్పారు. అలాగే, వైకాపా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం వైకాపా నేతలందరికీ సిగ్గుచేటు అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారు.. జగన్‌కు పక్షవాతం..? అనిత