Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఇళ్ల పక్కన ఉండేవారంతా దొంగలే.. వారి మాటలు నమ్మి జగన్‌ను నట్టేట ముంచొద్దు.. ధర్మాన

Advertiesment
dharmana prasada rao
, మంగళవారం, 28 మార్చి 2023 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఓ విజ్ఞప్తి చేశారు. మీ ఇళ్లపక్కన ఉండేవారంతా దొంగలేనని, వారి మాటలు నమ్మి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా ఉండరాదని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా ఓటేసి మీ చేతులో మీరే నరుక్కోవద్దు.. మీ గొంతు మీరే కోసుకోవద్దు అంటూ ధర్మాన సూచించారు. పైగా, వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఓటు వేస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా వైకాపాకు మరో ఛాన్స్ ఇవ్వాలని ధర్మాన ప్రసాద రావు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
శ్రీకాకుళం జిల్లా గారలో సోమవారం వైఎస్ఆర్ ఆసరా లబ్దిదాకులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు మరో యేడాది సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకొకరికి ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని అన్నారు. ఓటు ద్వారా మరోమారు వైకాపాకు అధికారం ఇవ్వాలన్నారు. 
 
ప్రస్తుతం అందుకుంటున్న పథకాలు, పొందుతున్న గౌరవం, కుటుంబ హోదా పెరగడం, పిల్లలు హాయిగా చదువుకోవడానికి కారణమైన వ్యక్తి, ఆ పార్టీ గుర్తు మీకు జ్ఞాపకం ఉండాలని అన్నారు. మీ కుటుంబం పొందుతున్న గౌరవం, ఆనందానికి కారణమైన వ్యక్తిని పిచ్చోడని, సైకో అని అంటే నమ్ముతారా అని ధర్మాన ప్రశ్నించారు. మనకు మేలు చేస్తున్న, ప్రయోజనం పొందుతున్న పార్టీని మళ్లీ మళ్లీ నిలబెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ్మినేని సీతారాం అంత పని చేశారా? టీడీపీ నేత సంచలన ఆరోపణలు