రాష్ట్రంలో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. మహిళలకు భద్రత కోసం త్వరలో ఒక కొత్త యాప్‌ను రూపొందించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో వరలక్ష్మి మృతి చెందడం బాధాకరమన్నారు.
అయితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నారు.
విమర్సలు చేసేముందు ప్రభుత్వ ఇన్వాల్మెంట్ అందులో ఎంతమాత్రం ఉంది. అసలు ప్రభుత్వాన్నే బాధ్యులను ఎందుకు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీడియాతో మాట్లాడారు.