Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనం

Advertiesment
red sandalwood
, సోమవారం, 2 నవంబరు 2020 (11:43 IST)
కడప శివారు విమానశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి అక్రమ మార్గంలో ఎర్ర చందనం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లో వెనుక వస్తున్న స్కార్పియో టిప్పర్ డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది.
 
డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఎర్ర చందనంతో ఉన్న రెండో కారులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. మొదటి కారులో ఉన్న ముగ్గురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్మగ్లర్లు కడప నుంచి తాడిపత్రి వైపు ప్రయాణి స్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో వారి వివరాలను తెలుసుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల భక్తులూ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే?