Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!

Advertiesment
రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!
, శనివారం, 31 అక్టోబరు 2020 (21:37 IST)
Roja_Bandla ganesh
సీనియర్ నటి రోజా, నటుడు, నిర్మాత బండ్లగణేష్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌లో కలిశారట. ఈ మేరకు ఫోజిచ్చిన ఓ ఫోటోను బండ్లగణేష్ నెట్టింట పోస్టు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు.. బండ్ల గణేష్‌కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్‌లో గొడవ జరిగింది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన రోజాపై.. బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా తన నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మాటలు లేవు. మాటాడుకోవడాలు లేవ్ అన్నట్టుగా అయిపోయింది.
 
అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్‌కు వీరిద్దరు హాజరైయ్యారట. దాంతో వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. 'చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేయడం విశేషంగా మారింది. ఈ ఫోటోను చూసినవారంతా సినీ ఇండస్ట్రీ అయినా..రాజకీయాలలోనైనా శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉండనే ఉందని చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌ల‌ర్ ఫొటో చిత్ర బృందాన్ని అభినందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్