Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దిరెడ్డి నా తండ్రి, మిథున్ నా తమ్ముడు, ఇక ఆ పదవా? అవసరం లేదు.. ఎవరు?

పెద్దిరెడ్డి నా తండ్రి, మిథున్ నా తమ్ముడు, ఇక ఆ పదవా? అవసరం లేదు.. ఎవరు?
, బుధవారం, 7 అక్టోబరు 2020 (13:42 IST)
ఫైర్ బ్రాండ్ రోజాకు ఏ విషయమైనా ముఖం మీద మాట్లాడటమే ఇష్టం. లోపల ఒకటి.. బయట మరొకటి దాచుకోవడం ఆమెకు తెలియదంటారు చాలామంది. అందుకే ఆమెను కొంతమంది అభిమానిస్తే.. మరికొందరు ద్వేషిస్తుంటారు. కానీ తాజాగా ఆమె మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
 
నాకు మంత్రి పదవి అంటే ఇష్టం లేదు. జగనన్న సిఎం కావాలనుకున్నాం. ఆయన అయ్యారు. మేమంతా సిఎంలే అంటూ నవ్వుతూ చెప్పారు రోజా. ఇక మా జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు. వారితో వైరం ఉందని బాగానే ప్రచారం చేస్తున్నారు.
 
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా తండ్రికి అత్యంత సన్నిహితులు. రాజకీయాల గురించి నాకు అస్సలు తెలియదు అన్నప్పుడు ఆయన మా ఇంట్లోఒక సభ్యుడు. మా ఇంటికి వచ్చివెళ్ళేవారు. మా నాన్నతో మాట్లాడేవారు. అలా మిథున్ రెడ్డి నన్ను అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. 
 
ఇదే నా కుటుంబం. ఇక సిఎం అంటారా మా అన్న. నేను ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటాను. అదే నా స్వభావం. నా నియోజకవర్గంలో ఎవరైనా పర్యటిస్తే నాకు ఖచ్చితంగా చెప్పాలి. ఇదే నేను అడిగాను. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విషయంలోను నేను అదే ప్రశ్నించాను. 
 
తప్పేముంది. దీన్ని కొంతమంది బాగా రాద్దాంతం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. నేను నగరి ఎమ్మెల్యే.. పుత్తూరు, నగరి ప్రాంతాలు నా నియోజకవర్గంలోదే. అందుకే నేను చెబుతున్నా. ఎవరైనా పర్యటించండి.. కానీ నేను స్థానిక ఎమ్మెల్యే కదా నాకు చెప్పండి అంటోంది రోజా. 
 
రాజకీయాలు అంటే విమర్శలు, ఆరోపణలు మామూలే. నన్ను ఫైర్ బ్రాండ్ అన్నారు. ఇంకా ఎన్నో ఎన్నో పేర్లతో పిలిచారు. నేను సంతోషించా. ఒక్కోసారి విమర్సలు చేసేటప్పుడు మీరు కూడా ఆలోచించండి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి అంటోంది రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శామ్‌సంగ్ నుంచి Galaxy M Prime.. అమేజాన్ ఇండియాలో సేల్