Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిటైరైనా తప్పించుకోలేరు.. ఆ అధికారులకు బాబు వార్నింగ్

Advertiesment
Chandrababu
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (06:17 IST)
అక్రమంగా ప్రవర్తించే అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవని, వారు రిటైరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

కొందరు పోలీసు అధికారులను ఈ ప్రభుత్వం పనిగట్టుకుని వేధిస్తోందని, రేపు తాము వస్తే ఇప్పుడు పనిచేస్తున్న వారికి ఇదే భాషలో ఇదే తీరులో సమాధానం చెప్పాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్‌ చేశారు. 200-300 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా.. జీతాలివ్వకుండా వేధిస్తున్నారు.

రేపు మేం వచ్చి ఇప్పుడు పనిచేస్తున్న వారి జీతాల నుంచి ఆ డబ్బును రికవరీ చేయడంతోపాటు ఈ తప్పులకు బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలా? రిటైరై వెళ్లిపోతామని కొందరు అధికారులు అనుకుంటున్నారు.

కానీ రిటైరైనా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని స్పష్టం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉంటే పోలీసులు వైసీపీతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
 
‘టీడీపీ నాయకులు నిలబడినా కూర్చున్నా కేసులు పెడుతున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేస్తే వైసీపీ నాయకులు తిరగగలిగేవారా? పాదయాత్ర చేయగలిగేవారా? బాబాయి హత్య జరిగి ఏడాదైనా నిందితులను పట్టుకోలేకపోయారు.

టీడీపీ నేతలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని పోలీసులు గుర్తించాలి. దానిని అణచివేస్తే నిరసన పెల్లుబుకుతుంది’ అని హెచ్చరించారు.

స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి డ బ్బులు కావాలని కొందరు నాయకులు అనుకుంటున్నారని, ప్రజలను మనవైపు తిప్పుకోగలిగితే డబ్బుల్లేకుండానే విజయం సాధించవచ్చని చెప్పారు. 
 
‘ప్రజలు అప్పుడప్పుడూ తప్పు చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారి ప్రలోభాలకు లొంగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలబడితే అభినందిస్తున్నారు.

ఇటీవల మండలిలో అలా నిలబడిన ఎమ్మెల్సీలను ప్రశంసించారు. కానీ, తమ వద్దకు వచ్చేసరికి ప్రజలు అప్పుడప్పుడు రూ.వెయ్యి, రెండు వేల ప్రలోభాలకు లొంగిపోయి తప్పు చేస్తున్నారు. దీనిపై చర్చ జరగాలి. అమరావతిని చంపివేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని జగన్‌ ప్రభుత్వం చంపేస్తోంది.
 
పట్టణ జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమరావతి నగరానికి శ్రీకారం చుట్టాం. కరెంటు చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు.

మద్యం రేట్లు పెంచారు. ‘జె’ ట్యాక్స్‌ కడుతున్న కంపెనీల బ్రాండ్లు మాత్రమే ప్రజలు తాగడానికి అనుమతిస్తున్నారు. మింట్‌ పత్రిక చేసిన సర్వేలో రాష్ట్రం అట్టడుగు స్థాయికి పడిపోయినట్లు తేలింది. బీసీలకు పైసా సాయం చేయలేదు.’

‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో శ్రమపడి తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలను జగన్‌ ప్రభుత్వం తరిమేస్తోంది. రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి.

జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన వాటి కన్నా తీసివేసినవే ఎక్కువగా ఉన్నాయి. 18 లక్షల రేషన్‌ కార్డులు, ఆరు లక్షల పింఛన్లు రద్దు చేశారు’ అని చంద్రబాబు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తణుకులో చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం... ఎందుకో తెలుసా?