Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీది ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం : చంద్రబాబు

Advertiesment
factionist government
వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లరలేదని.. అందుకే రైతులు, మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారినీ అష్టకష్టాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం పంజా విసిరిందన్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
 
3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించమంటూ ఉత్తర్వులు ఇవ్వడం..అలాగే 6 నెలల కన్నా ఒక్క రోజు వెయిటింగ్‌లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు చంద్రబాబు.

అధికారులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనే ఉన్మాద చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఉన్మాద ధోరణిని పాలకుల్లో ఎప్పుడూ చేడలేదన్నారు చంద్రబాబు. ప్రభుత్వం తప్పు చేసి.. ఆ తప్పునకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి: జ్యోతుల నెహ్రూ