ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ… కియా తమిళనాడుకు తరలిపోతోందన్నారు. కియాతో చర్చలు నిజమేనని తమిళనాడు అధికారులు స్పష్టం చేశారన్నారు.
తమ వాళ్లకే ఉద్యోగాలివ్వాలని వైసీపీ నేతలు బెదిరించారన్నారు. కియాను తరలించాలనుకోవడం దారుణమన్నారు. పిచ్చి తుగ్లక్ తో సమస్య తప్పదని కియా భయపడిందన్నారు. తప్పని పరిస్థితుల్లోనే కియా మార్చాల్సి వస్తోందంటున్నారు.
కియాను వీళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కియాకు సమస్యలు వచ్చాయని చంద్రబాబు నాయుడు అన్నారు.
కియాకు సహాయ నిరాకరణ చేయాలని అనంత రైతుల్ని జగన్ రెచ్చగొట్టారన్నారు. కియా సీఈవోను వైసీపీ ఎంపీ బెదిరించారన్నారు.
కియాతో రాష్ట్రానికి రూ.13,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కియా కంపెనీతో 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.