తణుకులో చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం... ఎందుకో తెలుసా?

బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (06:03 IST)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చికెన్, మటన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. వారం రోజులపాటు నాన్ వెజ్ అమ్మకూడదని అల్టిమేటం జారీ చేశారు.

ప్రజల్ని కూడా చికెన్, మటన్ తినొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో..కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా మాంసం ఉత్పత్తులపై నిషేధం విధించారు.

స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే నాన్‌ వెజ్‌ హాలీడే ప్రకటించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌