Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు

Advertiesment
Privileges
ఏపీలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు విశేషాధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది.

వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీడియా వాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి: టి.విజయ్ కుమార్ రెడ్డి