Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో రేపటి నుంచి ఉచితంగా రేషన్ పంపిణీ

ఏపీలో రేపటి నుంచి ఉచితంగా రేషన్ పంపిణీ
, శనివారం, 28 మార్చి 2020 (19:18 IST)
రేషన్ కార్డుదారులకు ఆదివారం నుండి ఏప్రిల్ 15 వరకు సంతకం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చెయ్యడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
 
శనివారం సాయంత్రం కలెక్టర్ విడిది కార్యాలయంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో చేపడుతున్న రేషన్ దుకాణాలు ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా ప్రకటించిన ప్రకారం తెల్ల రేషన్ కార్డు దారులకు మార్చి 29 నుండి ఏప్రియల్ 15 వరకు రేషన్ నిత్యావసర సరుకుల ను ఉచితంగా పంపిణీ చెయ్యడం జరుగుతుందన్నారు.

వైరస్ వ్యాప్తిని నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. పాత విధానం లొనే సరుకులను చౌక ధరల దుకాణాలు ద్వారా పంపిణీ చేస్తామన్నారు.

లబ్ధిదారుల సంతకాలు తీసుకుని సరుకులు అందచేస్తామని, సంతకం పెట్టేందుకు ఎవరి పెన్ను వారు తీసుకురావాలన్నారు. సంతకం రాని వారి తరపున సంబంధించిన విఆర్ఓ సంతకం తో సరుకులు అందచేస్తామన్నారు.

రద్దీ లేకుండా, సామాజిక దూరం పాటిస్తూ సరుకులను తీసుకుని వెళ్లాలన్నారు. విజయవాడ నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని 343 రేషన్ దుకాణాల్లో ద్వారా నిత్యావసర సరుకులు సుమారు 2 లక్షల65 వేల మంది కి అందచెయ్యడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఒక్క కార్డు దారునికి ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున బియ్యం, కార్డుకి ఒక కేజీ కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయడం జరుగు తుందన్నారు.
 
కృష్ణా జిల్లాలో ని 16 నియోజక వర్గాల్లో ఒక్కొక్క నియోజక వర్గానికి వంద పడకల ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మంత్రికి వివరించారు.

కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక దూరం పాటించడం ద్వారా సమర్థవంతంగా నివరించగల మన్నారు. ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నిత్యావసర సరుకుల తెచ్చుకోవడం కోసం కొంత సడలింపు ఇచ్చారన్నారు. 

కరోనా కర్ఫ్యూ లో ప్రజలు ఎక్కువగా రోడ్లపైకి వస్తున్నారని, ఇది శ్రేయస్కరం కాదన్నారు. ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని , క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. ఇళ్లనుండి బయటకు రాకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించండని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

మధ్యాహ్నం వరకు సమయం వున్నందున గుంపులుగా బయటకు రావద్దని కోరుతున్నా అని మంత్రి వెలంపల్లి పేర్కొన్నారు.మద్యం అమ్మకాలు జరిపినా, బ్లాక్ లో విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలు జరుపుతున్నమని, ఎవరైనా ఉద్దేశ్య పూర్వకంగా అమ్మకాలు చేస్తుంటే తమ దృష్టికి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు.

నిరాశ్రయులకు ఉచితంగా ఆహారం పంపిణీ దేవాదాయ ధర్మాదాయ శాఖా ద్వారా  స్వచ్ఛంద సంస్థలు ద్వారా  చేయడం జరుగుతున్న దన్నారు. రేషన్ షాపుల ద్వారాపంపిణీ చేసే సరుకుల నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 1138 మంది విదేశాలనుంచి వొచ్చిన వారిని నగరంలో గుర్తించామని తెలిపారు. 82 మంది హౌస్ సర్జనులు అందుబాటులో ఉంచామన్నారు.
 
దయచేసి బయటకు ఎవ్వరూ రావద్దు.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ పరిధిలోని 3నియోజకవర్గ ముల పరిధి లోని 301 రేషన్ దుకాణాలు ద్వారా 2 లక్షల 43 వేల మంది కి ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతున్నదని శాసన సభ్యులు మల్లాది విష్ణు తెలిపారు.

సరకులు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తగినంత దూరం పాటించాలని పేర్కొన్నారు. విజయవాడలో వచ్చిన పాజిటివ్ కేసులన్నీ విదేశాలనుండి వచ్చినవా రేనని, స్వీయ నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల మాత్రమే వ్యాప్తిని నిరోధించ గలమన్నారు.

దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో కరోనా వ్యాప్తి కేసులను చాలా వరకు రాష్ట్రంలో నియంత్రించ గలిగామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటు ను దుర్వినియోగం చేస్తూ అనవసరంగా నగర ప్రజలు రోడ్లపైకి రావద్దని కోరుతున్నామని తెలిపారు. 
 
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ కృష్ణా జిల్లా లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వివరాలు, వారి కుటుంబ సభ్యులు అందరినీ ఆరోగ్యం పై వాకబు చెయ్యడం జరుగుతున్న దన్నారు.

ఇప్పటికే జిల్లాలో మరోదఫా ఇంటి ఇంటి సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రెండు లక్షల ఇళ్ళ వివరాలు రేపటి లోగా పూర్తి చెయ్యడం జరుగుతుందన్నారు.  ప్రతి ఒక్క కేసు విషయంలో రూట్ మ్యాప్ రూపొందించి ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వి.మాధవీలత, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, రెవెన్యూ, పౌర సరఫరా ల శాఖ అధికారులు, విజయవాడ మునిసిపల్  శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా ఆప్టే‌కు ఏమైంది?