Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీడియా వాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి: టి.విజయ్ కుమార్ రెడ్డి

మీడియా వాళ్లు ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి: టి.విజయ్ కుమార్ రెడ్డి
, సోమవారం, 30 మార్చి 2020 (15:56 IST)
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు వృత్తిలో భాగంగా ఎక్కడికి వెళ్లడానికైనా అనుమతి ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ  కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు.

కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో పాత్రికేయులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని కొనియాడారు. మందులేని మహమ్మారి కరోనా వైరస్ సంక్రమించకుండా ప్రజలకు పాత్రికేయులు మరింత అవగాహన కల్పించాలని కోరారు.  కరోనా వైరస్ ఎవరికైనా రావచ్చని కాబట్టి మీడియాలో పనిచేసే వారంతా విధులు నిర్వర్తించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైన సందర్భంలో మాస్కులు ధరించాలని సలహానిచ్చారు. పాత్రికేయులు ముందుగా తమల్ని తాము రక్షించుకోవాలని కోరారు. తరుచూ మైకులు వాడుతున్న సందర్భంలో కరోనా సోకే ప్రమాదముందని కావున జాగ్రత్తగా ఉండాలన్నారు. శానిటైజర్ వాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వీలైతే మైక్ పై స్పాంజిను తరుచూ తీసివేస్తూ ఉండాలన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోమ్ సెక్రటరీ అజేయ్ భల్లా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించిన లేఖను చదివి వినిపించారు. లేఖలో భాగంగా ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్రాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతాలు మారే క్రమంలో కరోనా వ్యాధి మరింత  ప్రబలే అవకాశముండటంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలన్నారు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత రాష్ట్రాల వ్యక్తులకు భోజనం, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అభూత కల్పనలు, అపోహలు భయాందోళనలు కల్గించే వార్తలు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఒకవేళ ప్రచారం చేస్తే చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అవాస్తవ కథనాలను దయచేసి ఎవరూ షేర్ చేయవద్దని ఈ విషయంలో సామాజిక బాధ్యత వహించాలని కమిషనర్ కోరారు. మాస్క్ లు 5,6 గంటలకు పైగా ఎక్కువ సేపు వినియోగించవద్దని అనంతరం దాన్ని పాతిపెట్టడమో, కాల్చివేయడమో చేయాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప సాధారణ వ్యక్తులు మాస్కులు వాడాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులు మాస్కులు వాడాల్సిన అవసరముంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ మార్కెట్లు ఏర్పాటు: మంత్రి బొత్స