Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ : కర్నూలు కోర్టు ఆదేశం

Advertiesment
posani krishna murali

ఠాగూర్

, బుధవారం, 5 మార్చి 2025 (10:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కర్నూలు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ కేసులో పోసానిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోనీ పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో పోసానిని మంగళవారం అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లా కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన తర్వాత పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18వ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు  తరలించారు. మరోవైపు, నరసరావు పేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. కాగా, పోసానిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైవున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SSC Hall Tickets: విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు