Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
, ఆదివారం, 11 అక్టోబరు 2020 (18:41 IST)
స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించడం, ప్రాథమిక స్థాయి నుంచి అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా వైయస్‌ జగన్‌ సర్కార్‌ ముందడుగులు వేస్తోందని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  పేర్కొన్నారు.

గాంధీజీ మున్సిపల్ స్కూల్ లో జరిగిన జగనన్న కార్యక్రమంలో మంత్రి వెలంప‌ల్లి ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్ర‌సంగించారు. ఒక్కో విద్యార్థికి రూ.16 వందల విలువైన ‘జగనన్న విద్యా కానుక’ కిట్‌ను అందిస్తున్నామని అన్నారు.

విద్యా కానుక కోసం రూ.650 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యా కానుక కిట్లను పంపిణీ జ‌రుగుతంద‌న్నారు.
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున విద్య మీద దృష్టి సారించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని వ్యవస్థలను సీఎం వై యస్ జగన్‌ ప్రక్షాళన చేశారని తెలిపారు.
 
సీఎం జగన్‌ విద్య మీద తీసుకున్న శ్రద్ధ ఏ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. విద్య ద్వారానే సమాజంలో  పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నారు. విద్యకు కేంద్రంగా ఉన్నకృష్ణా జిల్లాలో పేద విద్యార్థులను ఆదుకునేలా విద్యా కానుకను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. 

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ విద్యలో అగ్రభాగాన ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి విద్యతో ఉన్నత శిఖరాలకు అధిరోహించదానికి ఈ పధకం దోహదపడుతుందన్నారు.  నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కార్య‌క్ర‌మంలో న‌గ‌ర పాల‌క సంస్థ‌, విద్యాశాఖ అధికారులు మరియు చాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్షులు కొన‌కళ్ళ విద్యాధ‌ర‌ రావు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతపై కోవిడ్-19 తీవ్ర ప్రభావం