తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) సోదాలకు దిగింది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిలో ఎన్ఐఏ అధికారులు సోదాలకు నిర్వహించారు.
గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు చేస్తున్నారు. అలాగే, పర్వతపురంలోని చైతన్య మహిలా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్ పూల్ యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేశారు.
నర్సింగ్ విద్యార్థిని రాధ రెండళ్ళ క్రితం ఏపీలోని విశాఖలో తప్పిపోయింది. దీంతో ఆమె తల్లి విశాఖపట్టణం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్పించుకున్నారని బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ కేసు రిజిస్టర్ చేసింది. దీంతో శిల్ప, దేవేంద్రతోపాటు కిరణ్ ఇండ్లలో ఎన్‌ఐఏ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది.