Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊగిపోతున్న సమాధి.. షేకవుతున్న పూలు... ఎక్కడ?

Advertiesment
ఊగిపోతున్న సమాధి.. షేకవుతున్న పూలు... ఎక్కడ?
, గురువారం, 25 జులై 2019 (14:11 IST)
ఆ సమాధి ఊగిపోతోంది. ఆ సమాధిపై ఉన్న పూలు షేకవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణులు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద కనిపించింది. 
 
జిల్లాలోని పొదలకూరు మండలం లింగంపల్లి వద్ద మాసుంసావలి దర్గాలో ఓ సమాధి ఉంది. ఈ సమాధి కదులుతోంది. దీంతో సమాధిపై వేసిన పూలు లబ్ డబ్ అంటూ కిందకు మీదకు కొట్టుకుంటుందో.. అచ్చం అలానే సమాదిపై ఉన్న పూలు కిందకు మీదకు కదులుతున్నాయి.
 
ఈ వింతను చూసిన స్థానికులు అదంతా అల్లా మహిమేనంటూ ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇందులో ముస్లిం సోదరులతోపాటు హిందూ భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఫలితంగా ఈ సమాధి ఉన్న ప్రాంతం ఓ జాతరలా కనిపిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదనీ టీడీపీ వాకౌట్.. సభకు దూరం