Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'వేస్ట్ నారాయణ... దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టు రీడ్'.... ఓ విద్యార్థిని లేఖ

ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన విద్యా సంస్థలపై తీవ్ర ఆరోపణ వచ్చింది. ఇప్పటికే నారాయణ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీకి చెంద

'వేస్ట్ నారాయణ... దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టు రీడ్'.... ఓ విద్యార్థిని లేఖ
, సోమవారం, 16 అక్టోబరు 2017 (08:57 IST)
ఏపీ మంత్రి పి. నారాయణకు చెందిన విద్యా సంస్థలపై తీవ్ర ఆరోపణ వచ్చింది. ఇప్పటికే నారాయణ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమైపోతూ.. కాలేజీ యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 
 
నారాయణ కాలేజీలో చదువుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని, వెంటనే కాలేజీలను మూసివేయాలని కోరింది. ఈ మేరకు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సాయి ప్రజ్వల అనే విద్యార్థిని లేఖరాసిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో కలకలం సృష్టించింది. 11వ తేదీ బుధవారం ఈ ఘటన జరుగగా, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికిన తల్లిదండ్రులు, తాజాగా పోలీసులను అశ్రయించారు. కాలేజీలో వేధింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని, వాటిని తట్టుకోలేకపోతున్నానని కూడా ప్రజ్వల తన లేఖలో ప్రస్తావించింది.
 
"సారీ డాడీ, సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. బై అక్క. వేస్ట్ నారాయణ కాలేజ్. దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టూ రీడ్. సో ప్లీజ్ హెల్ప్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ" అంటూ లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇంటి నుంచి బయలు దేరిన తర్వాత సాయి ప్రజ్వల ఎటు వెళ్లిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
webdunia
 
ఇటీవల కడప పట్టణంలోని నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదు. కార్పొరేట్‌ కాలేజీలకు ప్రభుత్వం వంత పాడుతుండటమే పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనిచేయని జగన్ బుజ్జగింపులు... వైకాపాకు బుట్టా రేణుక గుడ్‌బై..?