'నారాయణ'లో ఆగని ఆత్మహత్యలు... మరో విద్యార్థిని సూసైడ్
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా నారాయణ జూనియర్ కాలేజీలో మరో విద్యాకుసుమం రాలిపోయింది.
Publish Date: Fri, 06 Oct 2017 (10:31 IST)
Updated Date: Fri, 06 Oct 2017 (10:33 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా నారాయణ జూనియర్ కాలేజీలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని అనే విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఈ విషాదకర ఘటన జరిగింది.
శుక్రవారం తెల్లవారుజామున ఆమె హాస్టల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.