Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండ గుట్టవైపు తెలిసిన వ్యక్తితోనే చాందినీ... సీసీ టీవీలో స్పష్టం...

హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని చాందినీ జైన్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై హైదరాబాదు శివార్ల లోని అమీన్ పూర్ కొండల్లో శవమై తేలింది. ఆమెను హతమార్చిన వారి ఆచూకి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి

Advertiesment
Inter student
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (20:01 IST)
హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని చాందినీ జైన్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై హైదరాబాదు శివార్ల లోని అమీన్ పూర్ కొండల్లో శవమై తేలింది. ఆమెను హతమార్చిన వారి ఆచూకి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిపై అనుమానం వున్నట్లు పోలీసులు చెపుతున్నారు. 
 
ఇదిలావుంటే ఆరోజు చాందిని ఎటు వెళఅలిందన్న దానిపై సిసి టీవీ ఫుటేజిలను చూడగా... ఇంటి నుంచి వెళ్లేటపుడు ఆమెతోపాటు ఆటోలో ఓ వ్యక్తి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అమీన్ పూర్ గుట్టలవైపు చాందినితో పాటు ఓ వ్యక్తి కలిసి వెళ్లడం సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయింది. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు వేట మొదలుపెట్టారు. 
 
అమీన్‌ పూర్ గుట్ట అనేది మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా పేరుంది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచే తాగుబోతులు, ఇంకా ఇతర అసాంఘిక కార్యక్రమాలతో తూగిపోతుంటారనే పేరుంది. ఇక సాయంత్రమైందంటే పరిస్థితి మరింత తీవ్రంగా వుంటుంది. అలాంటి చోటుకి చాందినిని ఆ వ్యక్తి తీసుకుని వెళ్లాడంటే ముందుగానే ఓ పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా చాందిని మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె తల, మెడపై తీవ్ర గాయాలున్నట్లు తేలింది. ఆమె చెంపలపై కొరికినట్లు పంటి గాట్లు కూడా స్పష్టంగా వున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం చాందినీ జైన్ పోస్టుమార్టం ముగిసింది. చివరిసారిగా చాందినీ నలుగురు స్నేహితులకు ఫోన్లు చేసింది. వీరిలో ఇద్దరిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా చాందిని కాంటాక్ట్స్‌లో 'మై హాట్ ఫోన్ నెంబర్' అనే ఫోన్ నెంబరుతో ఆమె ఎక్కువగా సంభాషణలు చేసినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకేశారు... సొంత పార్టీ యోచనలో దినకరన్...