Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళగిరిలో ఓడిపోవడానికి కారణం అదే : నారా లోకేశ్

Advertiesment
nara lokesh
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (16:43 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన మంగళగిరి స్థానంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం నియోజకవర్గంపై సరైన అవగాహన లేకపోవడమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖపట్టణంలో మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా చేయడం వల్ల నాయకుడిగా తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, కానీ గతంలో తాను చేసిన చిన్న పొరపాటు ఓటమికి కారణమైనందన్నారు. 
 
గత ఎన్నికల సమయంలో కేవలం 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గం వచ్చాను. దాంతో అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం సాధ్యంకాలేదు. ఒక సంవత్సరం ముందే మంగళగిరి వచ్చివుంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రజల సమస్యలు ఏంటో లోకేశ్‌కి తెలిసేవి.. లోకేశ్ ఏంటో ప్రజలకు తెలిసేది అని వ్యాఖ్యానించారు. కానీ ఓడిపోయిన క్షణం నుంచి మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నాను. పాదయాత్రను మినహాయించి అధిక సమయం మంగళగిరి కోసం కేటాయిస్తున్నానను అని తెలిపారు. 
 
యేడాది కాలంలో కురవాల్సిన వర్షం ఒక్క రోజే కురిసింది : సీఎం స్టాలిన్ 
 
ఒక యేడాది కాలంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజే కురిసిందని, అందుకే దక్షిణాదిలోని ఆ నాలుగు జిల్లాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తమిళనాడు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలైన తిరునెల్వేలి, తూత్తుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఫలితంగా ఈ జిల్లాలపై జలఖడ్గం విరుచుకుపడింది. అతి భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఈ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. 
 
ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. హస్తినలో విలేకరులతో మాట్లాడుతూ ఒక యేడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజే కురిసిందని చెప్పారు. ఈ కారణంగానే ఆ నాలుగు జిల్లాలు నీట మునిగియాని చెప్పారు. 
 
"డిసెంబరు 17, 18 తేదీల్లో వాతావరణశాఖ అంచనా వేసిన దానికంటే భారీ వర్షాలు కురిశాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో గత 47-60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసింది. ఒక్క కోవిల్‌పట్టిలో ఏకంగా 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నారు. ఇప్పటివరకు దాదాపు 13 వేల మందిని శిబిరాలకు తరలించాం. హెలికాప్టర్ల ద్వారా నిర్వాసితులకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. సైన్యం సాయం కూడా కోరాం" అని సీఎం స్టాలిన్‌ వివరించారు.
 
కాగా, ఇటీవల చెన్నై సహా నాలుగు జిల్లాలను మిచౌంగ్ తుఫాను కుదిపేసిన విషయం తెల్సిందే. "తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12,059 కోట్లు, మధ్యంతర సాయంగా మరో రూ.7,033 కోట్లు కోరాం. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా నాలుగు జిల్లాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందించాం. కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందిస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టగలం" అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘజియాబాద్‌లో ఘోరం.. టీ పెట్టడంలో ఆలస్యం.. భార్యను నరికేసిన భర్త