Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ఇంట్లో దాక్కొని నీ కుక్కలతో దాడి చేయిస్తావు.. నువ్వే రా తేల్చుకుందాం : నారా లోకేష్

Advertiesment
Nara Lokesh
, బుధవారం, 20 అక్టోబరు 2021 (10:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నాళ్లు ఇంట్లో దాక్కొని నీ కుక్కలతో దాడి చేయిస్తావు అంటూ సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే నువ్వే రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. 
 
ఏపీలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం ఘటనలను తీవ్రంగా ఖండించిన నారా లోకేష్.. జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.
 
'ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు... ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు' అంటూ హెచ్చరించారు.
 
'ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!' అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు.
 
'తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?' అంటూ లోకేశ్ మండిపడ్డారు.
 
'నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు' అంటూ స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్‌: భారీ వర్షపాతంతో రికార్డు బద్దలు.. 107 సంవత్సరాల క్రితం..?