ఏపీ అసెంబ్లీ తన గురించి అధికార వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధపడటంపై ఆయన భార్య నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడుతారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి అన్నారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా లోకేశ్వరి తొలిసారి స్పందించారు. "రాజకీయాల్లో ఉన్నపుడు ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటి మాట్లాడుతుంటారు. మనసుకు బాధగా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కన పడేసి మన పని మనం చేసుకునిపోవడమే ఉత్తమం" అని నారా భువనేశ్వరి అన్నారు.
అంతేకాకుండా, వరదల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న తిరుపతి పట్టణ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన సిబ్బందిని కోరారు. ఈమేరకు నారా భువనేశ్వరి ఆదేశాలు జారీచేశారు. అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరారు.