Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసెంబ్లీ ఘటనపై Jr. ఎన్టీఆర్!.. ఇక ఆ సంస్కృతిని ఆపేద్దాం..

Advertiesment
అసెంబ్లీ ఘటనపై Jr. ఎన్టీఆర్!.. ఇక ఆ సంస్కృతిని ఆపేద్దాం..
, శనివారం, 20 నవంబరు 2021 (16:15 IST)
అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించారని.. ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. ఈ ఘటనపై బాబుకు పలువురు సంఘీభావం చెప్తున్నారు. అంతేగాకుండా నందమూరి ఫ్యామిలీ ఆయనకు వెన్నంటి వుండి.. ఈ చర్యకు తీవ్రంగా ఖండించింది.

తాజాగా అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని గుర్తు చేశారు. మన నవనాడుల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సాంప్రదాయం అది అని చెప్పారు. 
 
మన సాంప్రదాయాలను జాగ్రత్తగా, భద్రంగా రాబోయే తరాలకు అప్పజెప్పాలే కానీ... మన సంస్కృతిని కాల్చివేస్తూ రాబోతే తరానికి బంగారు బాట వేస్తున్నామంటే... అది మనం చేసే చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత దూషణకు గురైన ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 
 
అంతేగాకుండా అసెంబ్లీ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోలో రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం... దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేద్దాం. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరాలకు బంగారు బాట వేసేలా, మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా" అని జూనియర్ రాజకీయ నేతలకు విన్నవించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ సినిమా చేయాలా? వద్దా? అని భయపడ్డాను. కానీ.. - హీరోయిన్ వాసంతి