ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షలు చేపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడుల పట్ల ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహహరిస్తుందని దేవాలయాలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు దీక్ష చేపట్టారు.
దాడులను అరికట్టకపోతే మత సామరస్యం దెబ్బతింటుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యం కాని కారణాలు చెబుతున్నారని విమర్శించారు. ఆలయాలు రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నిర్ధిష్టమైన విధానం పాటించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలని రఘురామ కోరారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ తన నివాసంలో దీక్షలో కూర్చున్నారు. దీక్షకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు పలికారు. ఆయనకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు.