Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా..? పగలబడి నవ్వుకున్న క్రికెటర్లు

Advertiesment
IPL 2020
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:11 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సందడి దుబాయ్‌లో మొదలైంది. చెన్నై టీమ్‌లో కరోనా కేసులు బయటపడడంతో కఠిన నియమాల మధ్య ఆటగాళ్ళ గడుపుతున్నారు. రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. అలాగే బయోబుడగ దాటకుండా జియో ట్యాగింగ్‌తో అనుక్షణం వారిని గమనిస్తోంది ఓ టీమ్. తాజాగా ఇలాంటి వాతావరణంలో గడుపుతున్నవారి అనుభవం ఎలా ఉంటుందో ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివరించాడు. 
 
తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. డే బై డే కరోనా పరీక్షలు చేయించుకుంటామని, గది దాటితే జియో ట్యాగింగ్‌ పరికరం ఉండాల్సిందే అన్నారు. ఆటగాళ్ళు దగ్గర దగ్గరగా వెళుతున్నప్పుడు అది మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరంలోని గంట కూడా మోగుతుంది. ప్రస్తుతం అధికారులు ఇంతటి కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ఆటగాడు ప్రశ్న వేశాడు. సర్.. మా భార్యలు కూడా ఇలాంటి పరికరం ధరించాలా అని.. బయో బుడగలో ఉన్న ఎవరైనా సరే దీనిని ధరించాల్సిందేనని అధికారులు తెలిపారు. "అవునా మరి గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా" అంటూ హస్యంగా సమాధానం ఇచ్చాడు. దానికి అక్కడ పగలబడి నవ్వుకున్నాం అంటూ" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్‌ను వదిలిపెట్టని కరోనా.. బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యునికి కోవిడ్