Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తాం...

Advertiesment
mla gottipati ravikumar
విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (19:09 IST)
తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు విల‌పించిన దృశ్యాలు, టీడీపీ నేత‌ల్లో బాగానే వ‌ర్క్ అవుట్ అయిన‌ట్లున్నాయి. ఒక్కో టీడీపీ నేత త‌మ క‌లుగుల్లోంచి బ‌య‌ట‌కి వ‌చ్చి మ‌రీ తొడ‌గొడుతున్నారు. వైసీపీ నేత‌ల‌కు స‌వాళ్ళు విసురుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఒక‌డుగు ముందుకేసి, వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తాం...అని ప్ర‌క‌టించారు.
 
 
నారా భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవ‌ని, ఎన్టీఆర్ కుమార్తె గురించి మాట్లాడిన వైసీపీ నేతలను చూసి సభ్యసమాజం తలదించుకుంటుంద‌ని గొట్టిపాటి ర‌వికుమార్ చెప్పారు. 
 
 
చంద్రబాబు కన్నీరు పెట్టారు అని ఆనందంలో ఉన్న వైసీపీ నేతలకు, త్వరలోనే అసలు సినిమా చూపిస్తామ‌న్నారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగట్టడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామ‌ని, దీనికి ప్ర‌ణాళిక అంతా సిద్ధం అవుతోంద‌ని చెప్పారు. 2024లో అసెంబ్లీలో కి ఎందుకు అడుగుపెట్టామా అని వైసీపీ నేతలు భాదపడేలా టీడీపీ ప్రణాళిక ఉంటుంద‌ని చెప్పారు. వచ్చే ఎన్నికలతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడా కాపాడు, దీనంగా తిరుపతివాసులు