ఇపుడన్నీ నూక్లియర్ ఫామిలీలే. ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదు అయిపోయాయి. కానీ, మనుషులు మధ్య విలువలు , అప్యాయతలు తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు... ఈ ఉమ్మడి కుటుంబం కలయిక. విజయవాడ గజవాళి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అపూర్వ కలియక ఉమ్మడి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది.
విజయవాడ నగరంకి చెందిన గజవాళి కి చెందిన 150 మంది ఇంటి పేరు కలిగిన ఉమ్మడి కుటుంబంలో ఉండే మనుషుల మధ్య మానవ విలువలు , ప్రేమలు ,అప్యాయతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మొగల్రాజపురం పివిపీ స్కేర్ మాల్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది.
అమెరికా ,లండన్ , అస్ట్రేలియా ఇతర దేశాల నుంచి 150 కుటుంబాల చెందిన వారు విజయవాడ విచ్చేసి సందడీ చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మూడేళ్లు నుంచి కలవలేకపోయిన అందరూ సరదాగా అట పాటలతో మానసిక ఉల్లాసాన్ని పొందారు. అందరూ కలిసి ఆడారు, పాడారు. మూజికల్ చైర్స్, సాంగ్స్ ఆడి, ఆడి ఎంతో ఆప్యాయంగా ఒక చోట గడిపారు.