రాష్ట్రంలో వైసీపీ బ్లూ బ్యాచ్ (రౌడీమూకలు) అరాచకాలనేపథ్యంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిందని, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకొని, చట్టాన్ని తనచుట్టంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి, అనంతపురంలో బలైన స్నేహలత కుటుంబానికి ఏం సమాధానం చెబుతాడని టీడీపీఅధికారప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు.
శుక్రవారం ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు జగన్ అండగా ఉన్నాడని, రక్షణకల్పిస్తున్నాడని సినిమావారిని తలదన్నేలా అసెంబ్లీలో వైసీపీ మహిళానేతలు చెప్పిన డైలాగులు (మాటలు) ఏమయ్యాయని దివ్యవాణి ఎద్దేవాచేశారు. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పినవారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
రాష్ట్రమంతా గన్ ఎక్కడ...జగన్ ఎక్కడాఅని ఎదురుచూస్తున్నారన్నారు. మరో మహా తల్లి నిండుఅసెంబ్లీలో మాట్లాడుతూ, తన గుండె జగన్... జగన్ అని కొట్టుకుంటున్నట్లు చెప్పుకుందని, నేడు ఆగిపోయిన స్నేహలత గుండెను తిరిగికొట్టు కునేలా సదరుమహిళా ఎమ్మెల్యే చేయగలదా అని టీడీపీ మహిళా నేత నిలదీశారు. స్నేహలత కుటుంబానికి డబ్బులిచ్చి సరిపెట్టినం త మాత్రాన చనిపోయిన ఆమెఆత్మకు శాంతికలగదనే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మహిళలు తెలుసుకోవాలన్నారు.
జగన్ మాట ఇస్తే శాసనమని మరొకామె చెప్పిందని, వారివారి మాటల ద్వారా సదరుమహిళానేతలంతా ఆస్కార్ అవార్డుకు పోటీపడ్డారని దివ్యవాణి దెప్పిపొడిచారు. వ్యక్తిగతప్రయోజనాలకోసం, మంత్రి పదవులకోసం జగన్ ను పొగిడినవారంతా, స్నేహలత కుటుంబాని కి న్యాయంచేసే దిశగా ఎందుకుఆలోచించడం లేదన్నారు.
దిశాచట్టం అని మభ్యపెడుతున్న ప్రభుత్వం, స్నేహలత తల్లికి ఏం సమాధానం చెబుతుందన్నారు. దిశా స్టేషన్ కు ఆమె కాల్ చేసినా అక్కడున్న సిబ్బంది ఎందుకు స్పందించలేదో , ముఖ్యమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏమైందో చెప్పాలన్నారు. జగన్ 18నెలల పరిపాలనలో దాదాపు 260మంది మహిళలపై లైంగికవేధింపులు, అత్యాచారాలు, దారుణాలు జరిగాయన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం ప్రకారం 21రోజుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని పాలకులు చెప్పారని, ఇప్పటివరకు జరిగిన దారుణాలకు సంబంధించి ఏ కేసులో, అలా ఎంతమందికి శిక్షపడిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం నిజంగా అమల్లో ఉంటే, అనంతపురం జిల్లాలో ముక్కుపచ్చలారని 13ఏళ్లబాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన లారీడ్రైవర్ ను ఏం చేశారో, ఎలాశిక్షించారో, దిశాచట్టం ఏచేసిందో చెప్పాలన్నారు.
సదరు చట్టంలో చెప్పినట్లుగా 354(e), 354 (f) సెక్షన్లప్రకారం ప్రభుత్వం ఎందరిపై చర్యలు తీసుకున్నారని దివ్యవాణి నిలదీశారు. పాలకులు, అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పరుచూరి బ్రదర్స్ ను మించిపోయేలా డైలాగులు చెప్పడంతప్ప, ఆచరణలో అందుకు తగినవిధంగా పనులుచేయడంలేదన్నారు.
న్యాయమూర్తుల కొరత అనేది దేశవ్యాప్తంగా ఉందని, జాతీయ లా కమిషన్ కూడా ఇదే విషయం చెప్పిందని, ఇవన్నీ తెలిసీకూడా దిశాచట్టంలో కేవలం 21రోజుల్లోనే నిందితులకు శిక్షపడేలా చేస్తామని చెప్పడంముమ్మాటికీ ప్రజలను, ముఖ్యంగా ఆడబిడ్డల ను మోసగించడమే అవుతుందన్నారు. మృగాళ్ల చేతిలో బలైపోయిన ఏ ఆడబిడ్డకు, ఆమె కుటుంబానికి జగన్ తనపాలనలో న్యాయంచేశాడో, ఎందరుదోషులను శిక్షించాడో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.
వైసీపీనేతలు, కార్యకర్తలు పలుకేసుల్లో నిందితులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే ఘటనలు రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయన్న కేంద్ర ప్రభుత్వ నివేదికపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు ఇప్పటికైనా డైలాగులు చెప్పడంమానేసి, వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తే మంచిదన్నారు.
30ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న జే.సీ.దివాకర్ రెడ్డికుటుంబంపై దాడికి వెళ్లడం, సినిమాఫక్కీలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడటం, చూస్తుంటే, రాష్ట్రంలో సాగుతున్న రౌడీలపాలన ఇంకెన్నాళ్లు భరించాలనే భయాందోళనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని దివ్యవాణి స్పష్టంచేశారు.
వైసీపీ సోషల్ మీడియా వారు చేసేవ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారోచెప్పాలన్న ఆమె, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాదిరే, అధికార పార్టీనేతలకు, కత్తులు, కటార్లతో వైసీపీ సోషల్ మీడియావారిపైకి వెళ్లే ధైర్యంఉందా అని ఆమె నిలదీశారు.
న్యాయస్థానాలు జగన్ సాగిస్తున్న అన్యాయమైన పరిపాలనపై 133సార్లకు పైగా మొట్టికాయలు వేసినాసిగ్గుపడకుండా, ముఖ్యమంత్రి ఇప్పటికీ తనకునచ్చినట్టే సాగుతున్నాడన్నారు. వాలంటీర్లవ్యవస్థతో, ఇంటికొకపథకంపేరుతో అరకొరగా డబ్బు లిస్తూ, తిరిగి ఆసొమ్ముని ప్రభుత్వఖజానాకే చేరేలా చేసిన ఘనత వైసీపీప్రభుత్వానిదేనన్నారు. వాలంటీర్లు చేస్తున్న అరాచకాలు, ఆగడాలకు బాధ్యడు జగన్మోహన్ రెడ్డే అవుతాడన్నారు. రౌడీయిజంతో న్యాయాన్ని బయటకు రానీయకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలుచేస్తున్నాడన్నారు.
టీడీపీ కేవలం ప్రతిపక్షంమాత్రమే కాదని, అది ఎప్పుడూ ప్రజలపక్షా నే ఉంటుందని, ఆపార్టీకిచెందిన 1044 మందిపై వైసీపీ ప్రభుత్వం దాడికి పాల్పడిందని, 14మందిని దారుణంగా హతమార్చారన్నా రు. చంద్రబాబునాయుడు కూడా ఇదేమాదిరి ప్రవర్తించిఉంటే, జగన్ తన పాదయాత్ర చేయగలిగేవాడా అని దివ్యవాణి ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వంలో దగ్గరదగ్గర 320మంది మహిళలు బాధింపపడ్డా రన్నారు. వైసీపీప్రభుత్వం చేసే అరాచకాలపై టీడీపీ అధినేత ఎప్పుడూ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారని దివ్యవాణి స్పష్టం చేశారు. స్నేహలత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు అసెంబ్లీలో, బయట చెత్త డైలాగులు చెప్పడం మానేసి, ప్రజలగురించి ఆలోచిస్తే మంచిదని దివ్యవాణి హితవుపలికారు.