Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్థి.. ఎందుకంటే...

గొంతు కోసుకున్న ఇంటర్ విద్యార్థి.. ఎందుకంటే...
, మంగళవారం, 12 మార్చి 2019 (12:04 IST)
నల్గొండ పట్టణానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 13వ తేదీన చివరి పరీక్ష జరుగనుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన పరీక్షలను సరిగా రాయక పోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలన్న భయంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీకి సమీపంలో తరుణ్ కుమార్ అనే యువకుడు గొంతు కోసుకున్నాడు. అతన్ని ఎవరూ గుర్తించకపోవడంతో రాత్రంతా అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం కాలేజీ పరిసర ప్రాంతాలకు వాకింగ్‌కు వెళ్లిన కొంతమంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అచేతనంగా పడివున్న తరుణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, బాధితుడు ఇంటర్ విద్యార్థిగా గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు వద్ద విచారించగా అతను చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. 
 
తన పేరు మాచర్ల తరుణ కుమార్ అని, తనకు తానే గొంతు కోసుకున్నానని చెప్పాడు. మొదట తనపై ఎవరో గుర్తు తెలియనివారు దాడి చేశారని తెలిపారు. తర్వాత అసలు విషాయాన్ని బైటపెట్టారు. సూర్యాపేట జిల్లా కాసర్లకు చెందిన తాను ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టు చెప్పాడు. 
 
ప్రస్తుతం ఇంటర్‌కు పరీక్షలు జరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలు రాసిన తరుణ్ చివరి పరీక్ష రేపు అంటే మార్చి 13న రాయాల్సి ఉంది. ఈ క్రమంలో పరీక్షలు సరిగా రాయలేదనీ.. ఫెయిల్ అయిపోతాననే భయంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలీయక అయోమయానికి గురై ఈ పనికి పాల్పడినట్టు వెల్లడించాడు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తరుణ్ పోలీసులకు తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరుగురు కొడుకుల తల్లిదండ్రుల దుస్థితి