Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసిన హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్...

Advertiesment
ప్రాణం తీసిన హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్...
, సోమవారం, 11 మార్చి 2019 (18:09 IST)
జుట్టు రాలిపోవడం అనేది చాలా మందిలో ఉండే సాధారణ సమస్య. కొంత మందికి జన్యు లోపాల వలన జుట్టు రాలిపోతే మరికొంత మందికి మరికొన్ని కారణాలు ఉంటాయి. చాలా మంది ఇది పెద్ద సమస్యగా బాధపడిపోతుంటారు. సమాజంతో తిరగడానికి నామోషీ పడిపోతుంటారు. కప్పి ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తైలాలు క్రీమ్‌లు వాడతారు. అయినా ప్రయోజనం ఉండదు. చివరికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి కూడా సిద్ధపడతారు. అదే ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది. 
 
ముంబైలోని సాకినాక ప్రాంతానికి చెందిన వ్యాపారి శ్రావణ్ కుమార్ చౌదరికి 43 ఏళ్లు. జన్యు లోపాల వలన 30వ ఏడు నుండే అతనికి జుట్టు రాలిపోతూ వచ్చింది. తలపై చాలా భాగం జుట్టులేకుండా ఉండటంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. సిటీలోని సాదాసీదా క్లీనిక్‌కి వెళ్లి 9500 హెయిర్స్‌ను ప్లాంట్ చేయించుకున్నాడు. రెండు వారాల్లో జుట్టు వస్తుందని, అప్పటి దాకా మందులు వాడమని కొన్ని మందులు ఇచ్చారు వైద్యులు. 
 
శ్రావణ్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి పడుకున్నారు. తలపై ఒకటే దురదలు మొదలయ్యాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన భాగాన్ని టచ్ చేయకూడదని వైద్యులు చెప్పడంతో తాకకుండా వదిలేశాడు. కాసేపటికి తలపై బొబ్బలు, మంట వచ్చాయి. ఊపిరి ఆడలేదు, గొంతు వాచిపోయింది. వెంటనే సిటీలోని పొవాయ్ హీరానందిని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకుంటుండగా మరణించాడు. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటే ఏవైనా ఇబ్బందలు వస్తాయేమోనని కొంత మంది భయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

83 యేళ్ళ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దొంగ... ఎక్కడ?