ఆడబిడ్డలంటేనే ఖర్చులు... అదే కొడుకులైతే ఏదో ఉద్దరించేస్తారని... కొడుకుల కోసం ఎదురుచూసే తల్లిదండ్రులందరికీ ఇది ఒక గుణపాఠంలాంటి సంఘటన...
వివరాలలోకి వెళ్తే... జయశంకర్ - భూపాలపల్లి జిల్లా ఆజం నగర్‌కు చెందిన మంతు బసవయ్య (80) అనే వ్యక్తికి ఆరుగురు కొడుకులు. అయినప్పటికీ... ముదిమి వయసులో ఉన్న ఆ దంపతులను పట్టించుకొని, పట్టెడన్నం పెట్టేవాళ్లు కరువయ్యారు. అందులోనూ ఆసరా పింఛనులు పొందేందుకు కూడా అడ్డంకిగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కుమారుడు అడ్డుతగిలాడు.
మిగిలి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడంతో రైతుబంధు అందకపోవడం... వంటి సమస్యలతో తమను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకునేందుకు ఆ ముసలి దంపతులిద్దరూ సోమవారం టీఆర్‌ఎస్ భవన్ ఎదుట రోజంతా పడిగాపులు కాసారు. అయితే... అపాయింట్‌మెంట్ లేని కారణం సెక్యూరిటీ గార్డులు అడ్డు చెప్పడంతో ఆ కాస్తా ఆశ కూడా నిరాశగా మారి వెనుదిరిగారు.
మరి కేసీఆర్ ఏం చేయనున్నారో... వేచి చూడాలి...