Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికలకోడ్ అమల్లో ఉండగా ఏకగ్రీవాలంటూ ప్రకటనలివ్వడమేంటి? : అశోక్ బాబు

ఎన్నికలకోడ్ అమల్లో ఉండగా ఏకగ్రీవాలంటూ ప్రకటనలివ్వడమేంటి? : అశోక్ బాబు
, గురువారం, 28 జనవరి 2021 (11:15 IST)
పంచాయతీలు ఏకగ్రీవమైతే నజరానాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం మంచిదేనని, కానీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడే క్రమంలో పాలకులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకగ్రీవాలకు సంబంధించిన ప్రకటనలను కూడా ఆంగ్లదినపత్రికల్లో ఇచ్చిందని,  తెలుగుదినపత్రికల్లో రెండింటికి మాత్రమే ప్రకటన ఇచ్చారని, పల్లెల్లో ఎక్కువగా ఏ పత్రికలు చదువుతారో పాలకులకు తెలియదా అని అశో క్ బాబు నిలదీశారు.

పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలనే ఇప్పుడే ప్రభుత్వానికి ఎందుకొచ్చిందన్న ఆయన, గతంలో ఎన్నిక ల నోటిఫికేషన్ వెలువడినప్పుడు  ఈ ఆలోచన ఎందుకురాలేదన్నారు. ఆనాడేమో దుర్మార్గంగా, అరాచకత్వంతో ఏకగ్రీవాలు  చేయాలని ప్రభుత్వం చూసిందని, ఇప్పుడేమో ఎస్ఈసీకి సర్వాధి కారాలున్నాయి కాబట్టి చేసేదిలేకనే ఏకగ్రీవమైన పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం జరిగిందన్నారు.

ఎన్నికల నియమావళి, నామినేషన్ పత్రాలను కూడా తెలుగులోనే ప్రచురించారని, ఆంగ్లం లో ప్రచురించి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పల్లెల్లో ఉండేపరిస్థితులు, వాతావరణాన్ని బట్టే, అక్కడ ఏకగ్రీవాలు అనేవిఆధారపడి ఉంటాయన్నారు. ఏకగ్రీవం చేసుకోమని ప్రభుత్వం  చెప్పడాన్ని తాము తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు.

లక్షలు ఖర్చుచేసి, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం, ఎస్ఈసీ కుట్ర అని ప్రచారం చేయడం ఎంతమాత్రం మంచిదికాదని అశోక్ బాబు స్పష్టంచేశా రు. పాలకులు ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదని, దేశంలో అన్నింటికంటే  శక్తివంతమైనది రాజ్యాంగమేననే విష యాన్ని వైసీపీనేతలు గుర్తిస్తే మంచిదన్నారు. ఎన్నికల కమిషనర్  గొప్పా, ముఖ్యమంత్రి గొప్పా అనే ఆలోచనలు మానేసి, ఎవరి అధి కారాలు వారికుంటాయనే వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు.

రాజ్యాంగంలో కొన్ని అధికారాలు కొన్ని పరిస్థితుల్లో కొందరికే ఉంటాయని, అలానే ఎన్నికల సమయంలో ఎన్నికలఅధికారికే పూర్తి స్వాతంత్ర్యం ఉంటుందన్నారు. ఎన్నికల కమిషనర్ తప్పించి అధికారులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, వారిని ప్రభుత్వం ఆదరించాలనుకుంటే టీడీపీ కేంద్రప్రభుత్వపరిధిలోని డీవోపీటీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

పోలీస్ అధికారులను, ఇతర యంత్రాంగాన్ని ప్రభుత్వం తమజాగీరుల్లా వాడుకుంటోందని ఈ వ్యవహారంపై తాము ఎస్ఈసీకి ఫిర్యాదుచేస్తామన్నారు. సుప్రీం ఆదేశాలతోనే ప్రభుత్వం ఎస్ఈసీ చెప్పినట్లు నడుచుకోవడానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనే సందేహం హైకోర్టు న్యాయమూర్తులకుకూడా వచ్చిందన్నారు.

పంచాయతీఎన్నికలకు కరోనా వ్యాక్సినేషన్ సాకుగా చూపుతున్న ప్రభుత్వం, ఇతర వ్యవస్థలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంద న్నారు. ఏకగ్రీవాల పేరుతో పంచాయతీల్లో వైసీపీ ఆగడాలు, దౌర్జ న్యాలు చేయాలనిచూస్తే, టీడీపీ చూస్తూఊరుకోదని అశోక్ బాబు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి వైసీపీ వర్సెస్ ఇతరరాజకీయ పార్టీలు అన్నట్లుగా తయారైందన్నారు.

కడపలో అనేక పంచాయతీ లు ఏకగ్రీవాలు అయ్యాయని, కానీ ఆజిల్లాలోని గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వంచేసిన అభివృద్ధి తప్ప, ఈ ప్రభుత్వంలో చేసిందేమీ లేద న్నారు. ఎస్ఈసీని కులంపేరుతో దూషించినవారు,  అధికారంకోసం ఉద్యోగసంఘాలను, పరువుకోసం మతాన్ని వాడుకున్నవారు ఏకగ్రీవాలగురించి మాట్లాడటం ద్యయాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏకగ్రీవాల ప్రకటన పత్రికల్లో జారీచేయడం తప్పని,  ఆవ్యవహారంపై చర్యలు తీసుకోవా లని తాము ఎస్ఈసీకి ఫిర్యాదుచేయబోతున్నామన్నారు. పంచా యతీల్లో అన్నివర్గాల ప్రజలు ఒకతాటిపై నిలిచి, ఏకగ్రీవానికి ఒప్పు కుంటే మంచిదేనన్నారు. అలాకాకుండా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసినవారిని బెదిరించడం, ఇతరత్రా ప్రలోభాలకు గురి చేయడం వంటిచర్యలను చూస్తూ ఊరుకోబోమని టీడీపీనేత స్పష్టం చేశారు.

పంచాయతీల్లో ఎన్నికలుకూడా నిర్వహించలేని అసమర్థ పంచాయతీ రాజ్ శాఖామంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేస్తే మంచిదన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రం పరువు తీసేసిన వారు, ఆర్థికంగా, అభివృద్దిపరంగా రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లారన్నారు. నిన్నటివరక ఎన్నికలు వద్దని చెప్పినవారు, ఇప్పుడు ఏకగ్రీవాల జపంచేయడం విచిత్రంగా ఉందన్నారు.

ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తే, పాలకులకునేడు ఇటువంటి దుస్థి తి వచ్చేదికాదన్నారు. రాజ్యాంగంతో, హైకోర్టుతో, సుప్రీంకోర్టుతో పనిలేకుండా అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అధికారదుర్విని యోగమనే అంశాలపైనే తాము పాలనసాగిస్తామనే ఆలోచనలో వైసీపీ పాలకులు ఉన్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు సంబం ధించి ప్రభుత్వం జీవో ఇవ్వడం ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.

ఐఏఎస్ అధికారులు తమ విచక్షణ, అధికార పరిధిని కోల్పోయి ప్రవర్తిస్తే చూస్తూఊరుకోబోమని, వారి వ్యవహారశైలిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీనేత తేల్చి చెప్పారు. మంత్రి పెద్దరెడ్డి తన పదవికిరాజీనామా చేయడమో, లేక ముఖ్యమంత్రిని అడిగి శాఖమార్చుకోవడమో చేయాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప-బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల‌ సంగతేంటి?: ప్రధానమంత్రి