Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెదిరింపులతో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమైతే టీడీపీ చూస్తూ ఊరుకోదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Advertiesment
బెదిరింపులతో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమైతే టీడీపీ చూస్తూ ఊరుకోదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
, బుధవారం, 27 జనవరి 2021 (10:40 IST)
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయో మీడి యాముఖంగా వివరించారని, గత మార్చిలో భయానకవాతావర ణం సృష్టించి, రక్తపాతం, హింసతో అధికారపార్టీ ఏవిధంగా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందో, అదేవిధంగా హింసాయుతం గా ఏకగ్రీవాలుంటాయని సజ్జల మాటలనుబట్టిచూస్తే అర్థమవు తోందని  టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు  ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...
 
సజ్జల మాటలు విన్నవారెవరైనా ప్రభుత్వం ఏవిధంగా ఎన్నికల ముసుగులో ప్రత్యర్థిపార్టీలవారిని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందో అర్థంచేసుకోగలరు. సజ్జలవ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికలో ఏకగ్రీవాలకోసం వైసీపీ అనుసరించబోయే హింసాయుత పంథాకు దర్పణం పడుతున్నాయనడంలో సందేహంలేదు. వైసీపీ ఏకగ్రీవాలకు కృషిచేస్తుందని సజ్జల చెప్పడం చూస్తుంటే, ఒక రాక్షసుడు మీడియా ముందు కూర్చొని వేదాలువల్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. 

గతంలో నోటిఫికేషన్ వెలువడినప్పుడు అధికారపార్టీ ఏవిధంగా ఏకగ్రీవా ల కోసం ప్రజలను, ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసిందో అందరూ ప్రత్యక్ష్యంగా చూశారు.  గత ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాయుత ఘటలను చూస్తే, పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళ లపై దాడులు, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, నామినేషన్ పత్రాలు చించేసి చితకబాదడం, చిత్తూరు జిల్లాలో ఒకమహిళ నామినేషన్ పత్రాలను తన జాకెట్ లో దాచుకొ ని వెళితే, ఆమెపైకూడా దాడిచేశారు.

చిత్తూరు జిల్లాలో వృద్ధురాలు అనికూడా చూడకుండా ఎగబడ్డారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు గుంటూరుజిల్లా పల్నాడులో మహిళలపై అధికారపార్టీ వారు దాడి చేశారు. నరేగా పనులకు సంబంధించిన నిధులు రూ.2,500 కోట్లను విడుదలచేయకుండా, నామినేషన్లు ఉపసంహరించుకునే లా ఒత్తిడిచేశారు. పెండింగ్ బిల్లులను సాకుగా చూపి, బెదిరించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి,  వైసీపీవారే మద్యంసీసాలను టీడీపీ వారి ఇంట్లో పెట్టి, ప్రత్యర్థుల డిస్ క్వాలిఫై అయ్యేలా చేశారు.

ఈ ఘటన తెనాలిలో జరిగింది.  ఈ విధంగా అన్నిరకాలుగా దౌర్జన్యాలు, దాడు లతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. ఏకగ్రీవాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ, ఆగని దౌర్జన్యాలు, గాయపడిన అభ్యర్థులు, అడుగడుగునా నామినేషన్ల అడ్డగింత పేరుతో పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఇవే సజ్జల చెబుతున్న ఏకగ్రీవా లు. వృద్ధులు, మహిళలపై దాడిచేయడం, నరేగా బిల్లులను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు దిగడం,  నామినేషన్ పత్రాలు చించేయడం, ఇవే ఇప్పుడు సజ్జల చెబుతున్న, సంవత్సరం క్రితం  వైసీపీ వారుచేసిన ఏకగ్రీవాలు.

అందుకే సజ్జల నేడు ఏకగ్రీవం అనగానే రాష్ట్రప్రజలంతా ఉలిక్కిపడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు చాలాఉన్నాయి.  
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9,696 ఎంపీటీసీలుంటే, వాటిలో 2,362 ఎంపీటీసీలను బలవంతంగా ఏకగ్రీవంచేశారు. అందుకోసం ప్రతి జిల్లాకు రౌడీలను, అల్లరిమూకలను పంపించారు. మారణాయుధా లు సరఫరాచేశారు.

తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, ఇటువంటి కుట్రలు, కుతంత్రపు ఆలోచనలు చేసేది సజ్జల గారేకదా? ఆయన చేయించినంత బ్రహ్మండంగా బలవంతపు ఏకగ్రీవాలకు పథకరచన ఎవరూచేయలేరు. ఎంపీటీసీల్లో 24శాతం బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే, జడ్పీటీసీల్లో 19శాతం వరకుజరిగాయి.  

ముఖ్యమంత్రి సొంతజిల్లా కడపలో జడ్పీటీసీల్లో 76శాతంవరకు బలవంతపు ఏకగ్రీవాలుజరిగాయి.  ఎంతైనా సీఎం సొంత జిల్లా కదా... ఆ స్థాయిలో ఉంటుంది మరి. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్ష పాతంగాఎన్నిక జరిగి, ప్రజలకు ఓటేసే అవకాశం కనుక కల్పిస్తే,  ప్రజలచేతిల్లో చీవాట్లు తప్పవని తెలిసే, నేడు సజ్జల పెద్దఎత్తున హింసాయుతంగా బలవంతపు ఏకగ్రీవాలకు తెరలేపుతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఓటమికి భయపడే ఈ విధమైన కుట్రపూరిత ఆలోచనలు వైసీపీ వారు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. 

జరగబోయే పర్యవసానాలకు నామినేషన్లువేసే అభ్యర్థులే బాధ్యుల వుతారని చెప్పడంద్వారా సజ్జల ఎవరిని బెదిరిస్తున్నాడు. నేడు సజ్జల చేసినవ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలి. సంవత్సరం క్రితం ఏకగ్రీవాల పేరుతో అధికారపార్టీ వారు చేసినహింసకు సంబంధించిన కథనాలు పత్రికల్లో వచ్చాయి. అందువల్లే ఆ  ఏకగ్రీవాలనురద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరడం జరిగింది.

అదలా ఉండగానే, నేడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అదేమాదిరి బలవంతంగా, హింసాయుతంగా ఏక గ్రీవాలకు సిద్ధమవుతున్నామని, మా దొడ్లలో,ఇళ్లల్లో మారణాయు ధాలను సిద్ధంచేస్తున్నామని చెప్పినట్లుగా నేడు సజ్జల మాట్లాడా డు. సజ్జల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని, పంచాయతీ ఎన్ని కల నిర్వహణకోసం కేంద్రబలగాలను పిలిపించి, వైసీపీ రౌడీమూకల అరాచకాలను, బాధ్యతలేకుండా వ్యవహరించే ప్రతి అదికారిని నిలువరించి, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం.

హింసాయుతంగా, బెదిరింపులతో వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమైతే టీడీపీ చూస్తూఊరుకోదు. పంచాయతీఎన్నికల్లో  గుర్తుల తో పనిలేకపోయినా, టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగాఉన్నారు. వైసీపీరౌడీమూకలను అడ్డు పెట్టుకొని బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడాలని చూస్తే, ప్రజలు చూస్తూఊరుకోరని హెచ్చరిస్తున్నాను. 

వైసీపీ అరాచకపాలనను అర్థంచేసుకున్న ప్రజలు వైసీపీకి తగినవిధంగా బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సజ్జల తెలుసుకుంటే మంచిది. వైసీపీ మాదిరి రౌడీయిజం చేయకపోయినా, రాజ్యాంగంప్రకారం వారి హక్కులను కాపాడుకోవడానికి వారుసర్వదా సిద్ధంగా ఉన్నారు. రాజారెడ్డి రాజ్యంగం అమలుకు ఇప్పటికే అనేకప్రయత్నాలచేశారు.

అటువంటి కుటిలప్రయత్నాలు మానుకొని, నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లడిగితే వారు ఏవిధమైన సమాధానంచెబుతారో వైసీపీవారికి అర్థమవుతుం ది. ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేకుంటే నామినేషన్లు వేయకుండా విరమించుకోండి. ఎన్నికలకమిషనర్ గతంలో వైసీపీ చేసిన హింసను పరిగణనలోకి తీసుకొని, నేడు సజ్జల మాట్లాడిన మాటలను గుర్తించి, శాంతియుతవాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు, కమిషనర్ కు టీడీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ జైలు జీవితం ముగిసింది.. నేడే విడుదల.. డిశ్చార్జ్‌పై నిర్ణయం