Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడివాడ సందుల్లో పరిగెత్తించి కొట్టడం ఖాయం : కె.పట్టాభిరామ్

Advertiesment
గుడివాడ సందుల్లో పరిగెత్తించి కొట్టడం ఖాయం : కె.పట్టాభిరామ్
, మంగళవారం, 19 జనవరి 2021 (20:07 IST)
గౌరవమైన హోదాలో ఉండి, పౌరసరఫరాలశాఖామంత్రిగా కంటే, బూతుల సరఫరాశాఖా మంత్రిగానే కొడాలినానీ పేరుపొందాడని, ఆ వ్యక్తి మైలవరం వీరప్పన్ ఆహ్వానంతో నిన్నగొల్లపూడి వచ్చి, ఇష్టానుసారం నోరుపారేసుకున్నాడని, గ్యాంబ్లింగ్ ముఠానాయకు డు గుడివాడలో చెరువుగట్లపై పేకాటశిబిరాలు నడుపుతూ ఎలా దొరికిపోయాడో రాష్ట్రమంతా తెలుసునని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు.
 
గ్యాబ్లింగ్ ముఠానాయకుడు చేస్తున్న అవినీతి ఒకపక్కన కనిపిస్తుంటే, దానిపై సమాధానం చెప్పుకోలేని గుడివాడ వీధికుక్క మంత్రిగా ఉండటానికి అర్హుడేనా? పేకాట ఆడించే సన్నాసి, ఇసుకలో ఎంతకమీషన్ కొట్టేద్దామా... ఇళ్లపట్టాల్లో ఎంతనొక్కేద్దామా అని ఆలోచించే బ్రోకర్ గాడు చంద్రబాబు గురించి  మాట్లాడతాడా? ఇంట్లోదూరి తన్నేంత దమ్మున్న మగాడివైతే, వేలాదిమంది పోలీసులను అడ్డంపెట్టుకొని పిరికిసన్నాసిలా గుడివాడలో దాక్కుంది చాలక సిగ్గులేకుండా ఛాలెంజ్‌లు విసురుతావా? 
 
దమ్మున్నమగాడిలా, అన్నగారి విగ్రహంసాక్షిగా తేల్చుకుందాం రమ్మని దేవినేని ఉమా నిన్ననే చెప్పారు. ఆయన చెప్పిన చోటికి వచ్చే ధైర్యంలేక, ఆయన్ని అరెస్ట్ చేయించి, ఏదిపడితే అదిమాట్లా డతావురా నువ్వు. నువ్వు దేవినేని ఉమాకి ఫోన్ చేశావా? చీకటి పడితే ఫుల్ బాటిల్ తాగిపడిపోయే తాగుబోతులతో ఫోన్‌లో మాట్లాడేదేంట్రా? తాగిపడిపోయే సన్నాసులతో మాట్లాడే ఖర్మేంటి రా మాకు? పొద్దున్నేరమ్మంటే రాకుండా పోలీసులను ఎందుకు పంపించావురా? నీతిలేనివెధవా. గుడివాడ పిరికిసన్నాసిని నమ్ముకొని గన్నవరం నుంచి వెళ్లాడు మరోపనికిమాలిన వెధవ. 
 
గన్నవరంలో రాళ్లతో, చెప్పులతో కొడుతుంటే, సిగ్గులేకుండా గొల్ల పూడివచ్చి మాట్లాడతావా? గన్నవరంలో ఇద్దరిమధ్యన శాండ్ విచ్ అవుతూ, గుడివాడ పిరికిసన్నాసిని నమ్ముకొని వెళ్లిన నీపరిస్థితేంటో నీకు తెలుస్తుందా? పసుపుజెండాను వదిలేశాక, నీ బతుకు ఎలా ఉందో తెలుసుకో ముందు. గన్నవరంలో దిక్కులేనివ్యక్తి, గొల్లపూడి వచ్చి మాట్లాడతాడా? మైలవరం వీరప్పన్ ఎంత దోచుకున్నాడో, కొండపల్లి ఫారెస్ట్ నుంచి గ్రావెల్ ఎంతలా దోపిడీ చేశాడో అందరికీ తెలుసు. 
 
మైలవరం ప్రజలే మైలవరం వీరప్పన్ ని ఛీకొడుతున్నారు. వాడికి వంతపాడటంకోసం గుడివాడ పిరికిసన్నాసి, గన్నవరంలో చించిపారేసిన ప్రబుద్ధుడు, అమరావతిలో అరటితోటలు తగలబెట్టిన ప్రబుద్ధుడు వీరంతా కలిసి దేవినేని ఉమా గురించి గొల్లపూడిలో మాట్లాడతారా? దేవినేని ఉమాని విడుదలచేసి అప్పుడు మాట్లాడండి. ఎవరేంటో గొల్లపూడి సెంటర్లో తేలుతుంది? పిరికిసన్నాసుల్లా పోలీసులను అడ్డుపెట్టుకొని మాట్లాడటం కాదురా? దేవినేని ఉమాని వదిలితే, వేలాదిమంది ప్రజల సమక్షంలోనే గుడివాడసన్నాసి కథ, వీరప్పన్ సంగతేంటో, గన్నవరం గాడి సంగతేంటో తేలుస్తాం. 
 
ఈ వెధవలు వాగే పిచ్చి వాగుడుకి, వీధి నాటకాలకు టీడీపీనేతలెవరూ భయపడరు. దేవినేని ఉమా సహా, టీడీపీనేతలు, కార్యకర్తలంతా ప్రజలపక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము. 
నెల్లూరు జిల్లా ఎస్పీ గురించి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, అతనిపై చర్యలు తీసుకునే దమ్ములేని పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోకుండా, దేవినేని ఉమాగారిని అరెస్ట్ చేస్తారా? కొందరు దద్దమ్మ అధికారులు, నీతిలేని అధికారులవల్ల నిజాయితీపరులైన అధికారులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. 
 
పోలీస్ అధికారుల సంఘం నాయకుడినని చెప్పకునే దిక్కుమాలిన వ్యక్తి, ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకునేఅధికారం మీకు లేదు, ఐపీసీ చట్టాలు వైసీపీనాయకులకు వర్తించవా? బాధ్యతగల మంత్రి, మాజీ మంత్రిని పట్టుకొనిఇంట్లో దూరి కొడతానంటే పోలీసులు ఏం గడ్డి పీకుతున్నారు? కొడాలినానీపై వివిధ సెక్షన్ల కింద కేసునమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేయలేరా? మొన్నటికి మొన్న హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడితే, అప్పుడు కూడా చూస్తూ ఊరుకున్నారు. ఇంత సిగ్గులేకుండా విధులు నిర్వర్తిస్తారా? 
 
అంతకంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అంట్లుతోముకోండి. ఎవరు ఎవరిని వేధిస్తున్నారో, పోలీసులను అడ్డంపెట్టుకొని ఎవరు రాజకీయాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. గుడివాడ పిరికిసన్నాసికి దమ్ము, ధైర్యం ఉంటే సింహాన్ని బోనులో పెట్టి, బయట పిల్లుల్లా, పిరికిపందల్లా మాట్లాడటం కాదు. దేవినేని ఉమాని బయటకు వదిలి మాట్లాడండిరా. గుడివాడ వీధుల్లోనే కొడాలినానీ గోచీ ఊడిపోయేలా పరిగెత్తించికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. 
 
ఆ ఛానల్ కొచ్చి మాట్లాడతా.. ఈ ఛానల్ కొచ్చిమాట్లాడతా అనడం కాదురా... దమ్ముంటే దేవినేని ఉమాని విడుదల చెయ్..గొల్లపూడి సెంటర్లోనే తేల్చుకుందాం. వాస్తవాలతో గొల్లపూడి సెంటర్లో నీ గుడ్డలు ఊడదీయకపోతే చూడు. పోలీసులు ఉన్నారుకదా.. ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావేమో.. నీచిట్టా మొత్తం మా దగ్గరుంది. భవిష్యత్‌లో నీ గోచి ఊడిపోయేలా గుడివాడ సందుల్లో పరిగెత్తించడం ఖాయమని గుర్తుంచుకో కొడాలినానీ. ఖబడ్దార్ నానీ.. జాగ్రత్తగా మసులుకో అంటూ హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్ సర్కారు : కాల్వ శ్రీనివాసులు