Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పప్పు లోకేష్ కు ఇప్పటికీ బుద్ధి రాలేదు: మంత్రి కొడాలి నాని

పప్పు లోకేష్ కు ఇప్పటికీ బుద్ధి రాలేదు: మంత్రి కొడాలి నాని
, గురువారం, 31 డిశెంబరు 2020 (20:14 IST)
ప్రభుత్వం పేదప్రజలకిస్తున్న ఇంటి స్థలం చాలదంటున్న లోకేష్ , అచ్చెన్నాయుడులకు పశువుల కొట్టాలు కావాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు.

గురువారం గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పప్పు లోకేష్ కు ఇప్పటికీ బుద్ధి రాలేదన్నారు . పేదలకు నిర్మిస్తున్న ఇల్లు జగన్ బాత్ రూం అంతలేదంటూ మాట్లాడుతున్నాడని , బాత్ రూంను లోకేష్ ఎప్పుడైనా కడిగాడా అని ప్రశ్నించారు.

ఆంబోతులా ఉండే అచ్చెన్నాయుడును తెచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారని , ఆయన కూడా పేదలకిచ్చే ఇళ్ళు నాలాంటి వారికి సరిపోవని అంటున్నాడన్నారు. లోకేష్ , అచ్చెన్నాయుడులకు పశువుల కొట్టాలు కావాలని, వారికి పేదల ఇళ్ళు చాలవన్నారు.

నిత్యం సీఎం జగన్మోహనరెడ్డి పై బురద జల్లడమే వారి పనిగా మారిపోయిందన్నారు . చంద్రబాబుకు 73 ఏళ్ళ వయస్సు వచ్చిందని , 2024 లో జరిగే ఎన్నికల్లో గెలవకపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్ళు దాటతాయన్నారు . అప్పటి వరకు ఆయన ఉంటారో, లేదో తెలియదని , ఉంటే ఢీ సినిమాలో జయప్రకాష్ నారాయణను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తిప్పినట్టుగా చంద్రబాబును తిప్పాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటికే చంద్రబాబు బుర్ర పనిచేయడం లేదని , అప్పటికి శరీరంలో ఉన్న అవయవాలు కూడా పనిచేయవన్నారు . పుత్రరత్నం లోకేష్ గురించి చంద్రబాబుకు తెలుసని , అతను ఎందరూ పనికిరాని సన్నాసిగా మిగులుతాడన్నారు . లోకేష్ కు బుర్ర పెరగలేదని, బాడీ మాత్రం భారీగా పెరిగిందన్నారు.

ఇళ్ళస్థలాలు బాత్ రూంల సైజు ఉన్నాయని లోకేష్ మాట్లాడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో 30. 70 లక్షల మంది పేదలకు ఇళ్ళస్థలాలను పంపిణీ చేసేందుకు 66 వేల ఎకరాల భూములను సేకరించామని , ఇళ్ళు నిర్మించి , మౌలిక వసతులను కల్పించడానికి దాదాపు లక్ష కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు.

చంద్రబాబు హయాంలో 244 చదరపు అడుగుల్లో ఇళ్ళను నిర్మించారని , సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం 340 చదరపు అడుగులను కేటాయిస్తున్నారన్నారు. ఈ స్థలంలో బెడ్ రూం, కిచెన్, హాల్, బాత్ రూం, వరండా ఉంటాయని, ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే ఇళ్ళనిర్మాణ ప్రక్రియను ప్రారంభించారన్నారు.

లబ్ధిదారుల పిల్లలు పెద్దవాళ్ళయితే ఇంకో ఫ్లోర్ ను నిర్మించుకునేందుకు అవసరమైన ఫౌండేషన్ ను ఇంజనీర్లతో మాట్లాడి డిజైన్ చేశారన్నారు . సీఎం జగన్మోహనరెడ్డి తన సొంత ఇంటి నిర్మాణానికి కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోలేదన్నారు.

మోడల్ ఇంటిని కూడా నిర్మించి తలుపులు, కిటికీలు, గెడలు, కిచెన్ తదితరాల్లో ఏ ఏ వస్తువులను వాడాలో ఒకటికి పదిసార్లు స్వయంగా చూసి ఇళ్ళనిర్మాణాలను చేపట్టారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధనకు కృషి చేస్తా: ఆదిత్యానాధ్ దాస్