కార్మికులు కర్షకులు అనగారిన పేద వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు పోరాడిన మంచి మనసున్న నేత వంగవీటి రంగా అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.
గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో దివంగత నేత వంగవీటి రంగా 32 వ వర్ధంతి సందర్భంగా గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలినాని, యంపి. బాలశౌరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ కార్మికులు కర్షకులు అనగారిన పేద వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు పోరాడిన మంచి మనసున్న నేత వంగవీటి మెహన్ రంగా అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
అనంతరం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి మాట్లాడుతూ వంగవీటి రంగా మరణించి 32 సంవత్సరాల అయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారన్నారు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కార్పొరేటర్ సభ్యులుగా, శాసన సభ్యులుగా ప్రజలకు సేవాలందించారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు