Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ను నమ్మి మోసపోయిన జాబితాలో కొత్తగా ఉద్యోగవర్గం: అశోక్ బాబు

Advertiesment
జగన్ ను నమ్మి మోసపోయిన జాబితాలో కొత్తగా ఉద్యోగవర్గం: అశోక్ బాబు
, గురువారం, 17 డిశెంబరు 2020 (07:05 IST)
ఎన్నికలకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మోసపుమాటలు నమ్మిమోసపోయినవారిలో ఉద్యోగవర్గంకూడా చేరిందని చెప్పడా నికి, ఉపాధ్యాయులు తలపెట్టిన ఛలో రాజధాని కార్యక్రమమే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ  పరుచూరి అశోక్ బాబు తెలిపారు.

ఉపాధ్యాయబదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించడానికే టీడీపీ ప్రభుత్వం కౌన్సిల్  పద్ధతిని తీసుకొచ్చిందన్నారు.  వైసీపీప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలను కూడా రాజకీయకోణంలో చూస్తూ, 50శాతం వేకెన్సీ (స్థానాలను) లను తొక్కిపెట్టిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అర్థరాత్రి కూడా ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించిందన్నారు.

ఎన్నికలకు ముందు, సీపీఎస్ రద్దుచేస్తానని, డీ.ఏలు  సకాలంలో రద్దుచేస్తాననిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వాటిఊసే ఎత్తడంలేదన్నారు.   బదిలీల్లో తమకు జరుగుతున్న అన్యాయాని కి నిరసనగా ఉపాధ్యాయలంతా ప్రకాశం బ్యారేజీని దిగ్భంధించారని,  అయినాకూడా ప్రభుత్వంలో చలనంలేకపోవడం  బాధాకరమని టీడీపీఎమ్మెల్సీ వాపోయారు.

ఎక్కడికక్కడ ప్రభుత్వం ఉపాధ్యాయులను హౌస్ అరెస్ట్ లుచేసిందని, లేకుంటే రాష్ట్రంలోని ఉపాద్యాయులందరూ ప్రకాశం బ్యారేజీపైకి వచ్చిఉంటే, ఢిల్లీలో జరుగుతున్న రైతులఆందోళనకన్నా, ఉధృతమైన ఆందోళనను చూడాల్సి వచ్చేదన్నారు.  ప్రభుత్వ అలసత్వం, విద్యాశాఖ మంత్రికి అవగాహనలేకపోవడం వల్లే, ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సి వచ్చింద న్నారు.

బదిలీల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోపాటు, నాడు-నేడు పేరుతో వారిని వేధింపులకుగురిచేయబట్టే నేడు టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారని  అశోక్ బాబు తెలిపారు. నాడు-నేడు పేరుతో తల్లిదండ్రుల కమిటీలంటూ, స్థానిక వైసీపీనే తలు, ప్రధానోధ్యాయులపై ఒత్తిడిచేసి, పనులుజరగకపోయినా వారితో సంతకాలు పెట్టించుకోవడం జరిగిందన్నారు.

వైసీపీనేతల ఒత్తిడి భరించలేక చాలామంది ఉపాధ్యాయులు సెలవు పెట్టి వెళ్లిపోయారని, అనేకచోట్ల ఉపాధ్యాయులు కరోనాబారిన పడటం కూడా జరిగిందన్నారు. ఉపాధ్యాయులను ఒత్తిడిచేయడంతోపాటు, లిక్కర్ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా ఉంచడం, అమ్మకాలు నమోదుచేయాలనిచెప్పడం వంటి దారుణాలను ఈప్రభుత్వంలో చూశామన్నారు. వైసీపీప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించబట్టే, ఉపాధ్యాయల్లో అసంతృప్తి మొదలైందన్నారు. 
 
18నెలలైనా సీపీఎస్ రద్దుచేయలేదని, అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తానని జగన్ చెబితే, ఆర్థికమంత్రి బుగ్గన మండలిలో మాట్లాడుతూ, దానికి నిర్దేశిత కాలపరిమితి లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  డీఏల చెల్లింపును 2020లో ఒకటి, 2021లో, 2022లో ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, దేశంలో ఏప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేద న్నారు.

కేంద్రప్రభుత్వం ఏంచేసినా రాష్ట్రం అదే చేసేట్టయితే, పీఆర్సీ ఎందుకుఇవ్వలేదో సమాధానం చెప్పాలని టీడీపీఎమ్మెల్సీ నిల దీశారు. 01-07-2018న చెల్లించాల్సిన 11వపీఆర్సీని వైసీపీప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో  సమాధానం చెప్పాలన్నారు  జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏంచెప్పాడు.. ఇప్పుడేం చేస్తున్నాడనే ఆలోచన చేయబట్టే, నేడు ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు.

ఉపాధ్యాయులతో పాటు, మున్సిపల్ సిబ్బందితోపాటు, అనేక మంది రోడ్డుపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కోవిడ్ ఆంక్షలతో ప్రభుత్వం ఉద్యోగులను నిలువరిస్తోందన్నారు. ప్రభుత్వం ఎంతగొప్పదైనా, పాలకులకు ఎంతమెజారిటీ ఉన్నా, ఉద్యోగులు పనిచేస్తేనే ఏప్రభుత్వమైనా నిలుస్తుందనే నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిదన్నారు.

వారిని సక్రమంగా పట్టించుకోకుండా, వారి ఆలోచనలను పెడచెవిన పెడితే, ప్రభుత్వాలు పోవడం ఖాయమ న్నారు.  ప్రజలను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఉద్యోగులను కూడా విస్మరిస్తే, తగినమూల్యం చెల్లించుకుంటుందన్నారు. కొందరు నాయకుల మాటలునమ్మి, ఉద్యోగులను పట్టించుకోకుండా ముందుకెళితే, ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు. కొందరు ఉద్యోగసంఘాల నాయకులు ప్రభుత్వానికి డబ్బాలు కొడుతున్నా రని, వారిమాటలు నమ్మితే  జరగాల్సిన నష్టం కచ్చితంగా జరుగుతుందన్నారు. 

ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ పనులకు సంబంధించి ఏసీబీ ముందుకెళితే, ముందుగా కేసులు పెట్టేది ఉద్యోగులపైనే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. మంత్రులు మాత్రం ఉద్యోగులకు ఏమీ కాదంటూ బుకాయిస్తున్నారని అశోక్ బాబు తెలిపారు. 

ఛలో అసెంబ్లీకి పిలుపిచ్చినప్పుడే, ప్రభుత్వం ఉపాధ్యాయులను పిలిచి మాట్లాడితే, సమస్య ఇంతవరకు వచ్చేదికాదన్నారు. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇచ్చినఅనేక హామీలను జగన్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్రంలో 2లక్షలమంది ఉపాధ్యాయులుంటే, 30వేలవరకు ఖాళీలున్నాయని అశోక్ బాబు చెప్పారు. 

50 ఖాళీలను బ్లాక్ చేసి, ఉపాధ్యాయులను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.  పాఠశాలలను తొలగించడం లేదా వాటినికూడా వాలంటీర్లకు, వైసీపీనేతలకు అప్పగించాలన్నఆలోచనలోప్రభుత్వం ఉందా అని టీడీపీఎమ్మెల్సీ ప్రశ్నించారు. నాడు-నేడు పథకం కిందజరిగిన పనుల్లో సంతకాలు ప్రధానోపాధ్యాయులవైతే, కాంట్రాక్టులు చేసింది మాత్రం వైసీపీనేతలేనన్నారు. చేసినపనుల్లో ఏవైనా తేడాలు జరిగితే ముందుగా బలయ్యేది ఉపాధ్యాయులేనన్నారు. 

గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, టీడీపీ హాయాంలో ఉపాధ్యాయులు ఆందోళనలుచేసినా, వెంటనే వారితో చర్చలు జరపడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఉద్యోగులపై దాడిచేస్తే, జగన్మోహన్ రెడ్డికి ఊహించనివిధంగా నష్టం జరుగుతుందన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగుల గురించి బాగా తెలుసునని, అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నారు. 

విద్యాశాఖమంత్రికి సమస్య అర్థమయినట్లు లేదని, అసలు ఆయన ఎక్కడున్నాడోకూడా తెలియడం లేదన్నా రు. జగన్మోహన్ రెడ్డి తనకు డబ్బాలు కొట్టే నాయకులను నమ్మి, ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే, మొదటికే మోసం వస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలు ఉద్యోగులేననే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

పాలకులు తమస్వార్థం కోసం, ఉద్యోగులను బలిచేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వాలను మార్చేసినఘనత ఉద్యోగులకు ఉందనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ చేసిన ఖాళీలను సరిచేసి, ఉపాధ్యాయలకు అవకాశమివ్వాలని,  సీపీఎస్ ను తక్షణమే రద్దుచేయాలని, 11వపీఆర్సీని వెంటనే అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాల్సినవారిని గుర్తించాల ని, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికివెంటనేజీతాలు చెల్లించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు