ఖాకీనే కామపిశాచిగా మారాడు.. భార్యను వదిలించుకుని.. పరాయి మహిళతో?

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (19:43 IST)
గుంటూరులో ఖాకీనే కామపిశాచిగా మారిపోయాడు. గుంటూరు జిల్లాలో తరచూ వెలుగులోకి వస్తున్న పోలీసులపై లైంగిక వేధింపులు మొత్తం వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో భార్య ఫిర్యాదు మేరకు ఓ ఎస్సై బాగోతం బట్టబయలైంది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సై వెంకటకృష్ణ వేధింపులు తాళలేక.. అతని భార్య అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో తనతో సరిగా ఉండటం లేదని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
పరాయి మహిళ మోజులో పడి తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. వెంకట కృష్ణపై గతంలోనే కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదని ఆరోపించింది. అయితే, కేసు వెనక్కి తీసుకోవాలంటూ ప్రియురాలితో కలిసి భర్తపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం TrumpInIndiaBBC: డోనల్డ్ ట్రంప్, మెలానియా తాజ్‌మహల్ సందర్శన - LIVE